సందీప్ కిషన్ కోసం రంగంలోకి దిగిన డైరెక్టర్ , రైటర్

  • IndiaGlitz, [Monday,May 15 2017]

తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తోన్న సందీప్ కిషన్ తాజాగా మరో నూతన చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. 'దొంగాట', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ ఈసారి సందీప్ కిషన్ తో ఓ వైవిధ్యమైన పాత్ర చేయించేందుకు ప్లాన్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ సినిమాకు మోస్ట్ హ్యాపెనింగ్ రైటర్ ప్రసన్నకుమార్ స్టోరీ అందిస్తున్నట్లుగా దర్శకుడు వంశీకృష్ణ ప్రకటించారు.

గతంలో ప్రసన్నకుమార్ కథ అందించిన 'సినిమా చూపిస్తా మావ', 'నేను లోకల్' సినిమాలు సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాల మాదిరిగానే సందీప్ కిషన్ ని దృష్టిలో పెట్టుకొని ఓ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీని రెడీ చెసినట్లుగా ప్రసన్న తెలిపారు. ఇక ఈ సినిమాను 'సినిమా చూపిస్తా మావ'కి నిర్మాతగా వ్యహరించిన రూపేశ్ డి గోహిల్ నిర్మిస్తున్నారు. 'ఆర్ డి జి ప్రొడక్షన్ ప్రెవైట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక 'నేను లోకల్', 'భలే భలే మగాడివోయ్' సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందిందచేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత రూపేశ్ డి గోహిల్ తెలిపారు.

బ్యానర్ : ఆర్ డి జి ప్రొడక్షన్ ప్రెవైట్ లిమిటెడ్ నిర్మాత : రూపేశ్ డి గోహిల్ హీరో : సందీప్ కిషన్ దర్శకుడు : వంశీకృష్ణ(దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్) రైటర్ : ప్రసన్న కుమార్ బెజవాడ(సినిమా చూపిస్తా మావ, నేనులోకల్) సినిమాటోగ్రాఫర్ : నిజార్ షఫి

More News

'కేశవ' సెన్సార్ పూర్తి.... 19 న రిలీజ్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,‘సూర్య వర్సెస్ సూర్య’,‘కార్తికేయ’...

'భవంతి 108'

నలుగురు జంటలు అడవిలో దారితప్పి ఓ ఆసుపత్రికి వెళ్ళిన నేపథ్యంలో సాగే కథతో 'భవంతి 108' చిత్రం రూపొందింది.

వరంగల్ లో ఎస్ పి ఐ సినిమాస్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ గ్రాండ్ లాంచ్

చైన్నైలో పేరు గాంచిన ఎస్ పి ఐ సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించింది. తెలంగాణ రాష్ట్రంలో

డాన్సర్ పాత్రలో ఎన్టీఆర్

జనతా గ్యారేజ్ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో

వెంకీ ప్లేస్ లో పవన్ కళ్యాణ్

బాలీవుడ్ సినిమా 'జాలీ ఎల్ఎల్ బి2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని