close
Choose your channels

ఆరడుగుల బుల్లెట్ ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమా... గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ - డైరెక్టర్ బి. గోపాల్

Wednesday, October 6, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ్యాచో స్టార్ గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ''ఆరడుగుల బుల్లెట్''. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 8న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు బీ గోపాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

ఆరడుగుల బుల్లెట్ ఓ కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ.

మణిశర్మ గారు ఇచ్చిన సంగీతం బాగుంది. సమరసింహారెడ్డి, ఇంద్ర ఇలా ఎన్నో మంచి పాటలు ఇచ్చారు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్, నయనతారతో లవ్ స్టోరీ, విలన్స్‌తో క్లాష్ హై ఓల్టేజ్‌గా ఉంటుంది. గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్.

ఆకతాయి కొడుకు, స్ట్రిక్ తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు బాగున్నాయి.

నరసింహ నాయుడు సినిమా విడుదలైన తరువాత పది నెలలు ఖాళీగా ఉన్నాను. 1985లో దర్శకుడిని అయ్యాను. కానీ నేను చేసింది 35 సినిమాలే. మామూలుగా అయితే వందల సినిమాలు చేయోచ్చు. కానీ నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. అందరికీ నచ్చేలా ఉంటేనే సినిమాను చేస్తాను.

అశ్వనీదత్ గారు, చంటి అడ్డాల గారు ఒకేసారి నా దగ్గరకు వచ్చారు. అలా ఇంద్ర, అల్లరి రాముడు చిత్రాలు మొదలయ్యాయి. అలా స్క్రిప్ట్‌లు రెడీ అయితే ఒకేసారి రెండు సినిమాలు కూడా చేశాను.

అందరికీ ఈ సబ్జెక్ట్ నచ్చే చిత్రాన్ని చేశాం. వక్కంతం వంశీ కథ నిర్మాతలకు, గోపీచంద్ అందరికీ నచ్చడంతోనే మొదలుపెట్టాం.

నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు,కొత్త రచయితలను అందరినీ అడుగుతుంటాను. మస్కా సినిమాతో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్ని కృష్ణను కూడా నేనే పరిచయం చేశాను. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను.

స్క్రిప్ట్ బాగుంటే.. సూపర్ హిట్ అవుతాయి. లేదంటే ఫ్లాప్ అవుతాయి. క్రాక్ జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. చివరకు జనాలకు నచ్చితేనే ఆడుతాయి. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్ర బ్లాక్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.