close
Choose your channels

కల్యాణ్ రామ్ చెప్పడంతో మూవీ టైటిల్ మార్చిన డైరెక్టర్

Monday, January 13, 2020 • తెలుగు Comments

కల్యాణ్ రామ్ చెప్పడంతో మూవీ టైటిల్ మార్చిన డైరెక్టర్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడ‌వురా’. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. కాగా.. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుని ఎలాంటి క‌ట్స్ లేకుండా క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేస్తున్నారు.

ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు!?
ఈ సంద‌ర్భంగా సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం షురూ చేసింది. తాజాగా.. కల్యాణ్ రామ్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. అయితే సినిమాకు ‘ఎంత మంచివాడ‌వురా’ కాకుండా మరో పేరు అనుకున్నారట. ఆ విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాడు. ‘‘ఈ సినిమాలో హీరో ఏదీ నెగెటివ్‌గా తీసుకోడు. ఆయన అనుకున్నదే పాజిటివ్‌గా ఆలోచిస్తుంటూ ముందుకెళ్తుంటాడు. అలా తాను ఉండటమే కాకుండా మిగతావారిని మార్చడానికే ప్రయతత్నాలు చేస్తుంటాడు. సతీశ్ వేగేశ్నగారి కథ, మాటలు ఈ సినిమాకి బలం. ముందుగా ఈ సినిమాకి ఆయన ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే తెలుగుదనం నిండిన టైటిల్ అయితే బాగుంటుందని నా అభిప్రాయాన్ని చెప్పాను.  ఆ తర్వాత ‘ఎంత మంచివాడవురా’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ తరహా కథను నేను చేస్తున్నట్టు చెప్పినప్పుడు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆనందపడ్డాడు. ఈ కథ అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకుంది’ అని కల్యాణ్ రామ్ చెప్పాడు.

Get Breaking News Alerts From IndiaGlitz