ప్రదీప్ మాట్లాడుతుండగా.. స్టేజిపైనే కుప్పకూలిన డైరెక్టర్

  • IndiaGlitz, [Sunday,January 24 2021]

ఆనందంగా సాగిపోతున్న ప్రెస్‌మీట్‌లో ఊహించని ఘటన షాక్‌కు గురి చేసింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి చేస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా గతేడాది విడుదలకు నోచుకోలేదు. దీంతో జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రి రిలీజ్ ఈవెంట్స్ లాంటి వాటిన్నింటికీ బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రెస్‌మీట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.

ఈ ప్రెస్‌మీట్‌లో‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. తమ చిత్రానికి ఆది నుంచి సపోర్టును అందిస్తున్న మీడియాకు.. అలాగే సినీ పరిశ్రమలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హీరో ప్రదీప్ మాట్లాడుతూ.. తమ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్‌కు ‘నీలి నీలి ఆకాశం’ వంటి అద్భుతమైన పాటను అందించిన చంద్రబోస్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

కాగా.. ప్రదీప్ మాట్లాడుతుండగానే స్టేజీపై ఆయన వెనుక నిలుచొని ఉన్న దర్శకుడు మున్నా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రదీప్‌తో పాటు స్టేజిపైనే ఉన్న ఇతర చిత్రబృందం ఆయనకు మంచి నీళ్లు అందించి.. స్టేజీపై నుంచి కిందకు తీసుకెళ్లి ప్రథమ చికిత్సను అందించారు. పని ఒత్తిడి కారణంగా ఏమాత్రం రెస్ట్ లేకపోవడంతో మున్న అలా హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయినట్టు తెలుస్తోంది.

More News

ఆ దృశ్యాలు నా గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి: పవన్

దివీస్ నిరసనకారుల విడుదల సంతోషాన్నిచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అక్కడి బాధితుల ఆవేదన, ఆక్రందనలను స్వయంగా చూశానన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి: పవన్

గ్రామ స్వరాజ్యంతోనే పల్లెలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని మహాత్మా గాంధీ ఎంతో దూరదృష్టితో చెప్పిన మాటలు అనేక సందర్భాలలో

'రాధేశ్యామ్‌' విడుదల మరింత ఆలస్యం.. ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తాజా చిత్రం 'రాధేశ్యామ్‌' విషయంలో అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్య తీసుకోండి: పవన్

జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్య తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు.

ఇక నుంచి మే వరకూ సినీ ప్రియులకు ప్రతి నెలా పండుగే..

తొమ్మిది నెలల పాటు థియేటర్‌లో సినిమాలకు దూరమైన సినీ ప్రియులకు ఇక నుంచి ప్రతి నెలా పండుగే కానుంది.