మలయాళ రీమేక్ డైరెక్ట‌ర్ ఖ‌రారు?

  • IndiaGlitz, [Thursday,June 11 2020]

తెలుగు సహా అన్నీ భాషల్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్నాయి. ఏ భాష‌లో సినిమా హిట్ అయినా ప్రేక్ష‌కుడు సినిమాను చూడ‌టానికి ఆస‌క్తి చూపుతున్నాడు. మేక‌ర్స్ కూడా స‌ద‌రు ప‌ర‌భాషా చిత్రాల‌ను మ‌న తెలుగు నెటివిటీలోకి మార్చి రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో అలాంటి రీమేక్ ప్ర‌య‌త్నం ఒక‌టి జ‌రుగుతుంది. వివ‌రాల్లోకెళ్తే...మ‌ల‌యాళంలో విజ‌య‌వంతమైన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొంద‌నుంది. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా న‌టించ‌బోతున్నారు.

మ‌రి ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తారు? అనే దానిపై నిర్మాత‌లు చాలానే ఆలోచించారు. అయితే తాజా స‌మాచారం మేర‌కు డైరెక్ట‌ర సుధీర్ వ‌ర్మ ఈ రీమేక్‌ను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని టాక్‌. గ‌తంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో శ‌ర్వానంద్‌తో ర‌ణ‌రంగం సినిమాను తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ‌. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే కూడా నిర్మాత‌లు సుధీర్ వ‌ర్మ‌పై న‌మ్మ‌కంతోనే ఈ రీమేక్‌ను అప్ప‌గిస్తున్నార‌ని టాక్‌. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌గానే సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌, రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య జ‌రిగే ఇగో వార్ ఆధారంగా తెర‌కెక్కిన చిత్ర‌మిది.