ఏడాదికో బ‌యోపిక్‌తో ప‌ల‌క‌రించ‌నున్న ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Tuesday,May 29 2018]

'గమ్యం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్). వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఈ దర్శకుడు.. ప్రస్తుతం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చరిత్రకారుల సినిమాలపైనే దృష్టి సారిస్తున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. 2017లో బాలకృష్ణ 100వ చిత్రంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని తెరకెక్కించారు. తెలుగు వారి వీరత్వానికి అద్దం పడుతూ శాతవాహన చక్రవర్తి శాతకర్ణి చరిత్రను ఎంతో చక్కగా వెండితెరపై ఆవిష్కరించారు. ప్ర‌స్తుతం.. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ప్రాణాలను సైతం పణంపెట్టి బ్రిటీషు వారిని ఎదిరించిన వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జీవితకథ ఆధారంగా 'మణికర్ణిక'ను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న‌ ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే.. మహానటుడు, ఆంధ్రుల ఆరాధ్య న‌టుడు అయిన ఎన్టీఆర్ బయోపిక్ 'య‌న్.టి.ఆర్'ను తెరకెక్కించే బాధ్యత కూడా తీసుకున్నారు ఈ దర్శకుడు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తోంది.

అంటే.. ప్రతీ ఏటా ఓ చరిత్రను ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నార‌న్న‌మాట ద‌ర్శ‌కుడు క్రిష్. అన్నట్టు.. తాజాగా విడుద‌లైన మహానటి సావిత్రి బయోపిక్ 'మహానటి'లో కె.వి.రెడ్డి పాత్రలో క‌నిపించి ప్రేక్షకులను అలరించారు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌.