close
Choose your channels

ఖైదీ నెంబర్ 150 ఎన్టీఆర్‌తో నేను చేయాల్సింది.. అలా మెగా కాంపౌండ్‌కి : గోపీచంద్ మలినేని సంచలనం

Monday, January 23, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సరిగ్గా ఏడున్నర సంవత్సరాల క్రితం రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత సినీ పరిశ్రమలో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ అంటే మామూలుగా వుండకూడదు కదా. ఆయన స్టామినా, క్రేజ్‌కు తగ్గట్టుగా కథను రెడీ చేసే బాధ్యతను పలువురికి అప్పగించారు. అలాగే దర్శకుడి ఎవరనే దానిపైనా పలు పేర్లు వినిపించాయి. దీనిపై చిత్ర పరిశ్రమలోనూ, మీడియాలోనూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. చివరికి ఇళయ దళపతి విజయ్ నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘‘కత్తి’’ని మెగాస్టార్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు.

2017 సంక్రాంతికి రిలీజైన ఖైదీ నెంబర్ 150:

ఖైదీ నెంబర్ 150గా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017 జనవరి సంక్రాంతి కానుకగా విడుదలై వసూళ్ల సునామీ సృష్టించింది. రీ ఎంట్రీలోనూ చిరంజీవి స్టామినా చెక్కు చెదరలేదని నిరూపించింది. ఈ చిత్రం ఇచ్చిన ధైర్యంతో మెగాస్టార్ వరుస సినిమాలు చేశారు. సైరా నర్సింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, ఇప్పుడు వాల్తేర్ వీరయ్య. 70లకు చేరువవుతున్నా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు చిరంజీవి.

ఏడున్నరేళ్ల నాటి సంగతుల్ని చెప్పిన గోపీచంద్ మలినేని:

ఇదిలావుండగా.. అసలు కత్తి రీమేక్‌లో నటించాల్సింది చిరంజీవి కాదట జూనియర్ ఎన్టీఆర్ అంట. అలాగే దర్శకుడు వివి వినాయక్ కాదట.. గోపీచంద్ మలినేని అంట. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ మలినేని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన మంచి ఫామ్‌లో వున్నారు 2021 సంక్రాంతికి క్రాక్‌తో హిట్ కొట్టిన గోపీ.. ఇప్పుడు వీరసింహారెడ్డితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ కత్తి రీమేక్ నాటి సంగతులను పంచుకున్నారు.

రెండు సార్లు ఎన్టీఆర్‌తో ఛాన్స్ మిస్సయ్యింది:

కత్తి సినిమా రీమేక్‌ను తాను తెలుగులో తారక్‌తో చేయాలని దర్శకుడు ఏఆర్ మురగదాస్ ప్రపోజల్ పెట్టారని.. దీని గురించి తాను ఎన్టీఆర్‌తోనూ మాట్లాడినట్లు గోపీ చెప్పారు. రీమేక్ రైట్స్ గురించి చర్చలు జరుగుతుండగానే.. తమిళ నిర్మాతలు, చిరంజీవి రీమేక్ రైట్స్‌కు సంబంధించి ఒప్పందం కుదర్చుకున్నారని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో కత్తిని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేద్దామని విజయ్ దానిని అడ్డుకున్నారని దీంతో ఆలస్యమై ఆ ఛాన్స్ తనకు మిస్ అయ్యిందని గోపీచంద్ చెప్పారు. ఆ తర్వాత తారక్‌తో తాను ఎలాగైనా సినిమా చేయాలని దిల్‌రాజ్ ఓ ప్లాన్ చేశారని.. దీనికి సంబంధించి ఎన్టీఆర్‌కి కథ చెప్పానని.. అయితే ఆ కథ హెవీ యాక్షన్‌తో వుండటంతో జూనియర్ నో చెప్పారని గోపీ అన్నారు. తన నుంచి ఆయన కామెడీ లైన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ స్వయంగా చెప్పడంతో.. సెకండ్ ఛాన్స్ కూడా మిస్ అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశాన్ని గోపీచంద్ మలినేని రెండుసార్లు మిస్ అయ్యారు. మరి ఈసారైనా వీరిద్దరి కాంభినేషన్‌లో సినిమా రావాలని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.