close
Choose your channels

తండ్రి పాత్ర‌లో డైరెక్ట‌ర్‌...

Friday, March 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తండ్రి పాత్ర‌లో డైరెక్ట‌ర్‌...

ప్రేమ క‌థా చిత్రాల‌తో పాటు.. పోలీస్ ఆఫీస‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన గౌత‌మ్ మీన‌న్ ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్పుడు ఓ హీరోకి తండ్రి పాత్ర‌లో న‌టించ‌బోతుండ‌టం టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అవుతుంది. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు.. గౌత‌మ్ వాసుదేవ‌న్ మీన‌న్‌. ఇంత‌కు ఈయ‌న తండ్రి పాత్ర‌లో న‌టించ‌బోయే సినిమా ఏదో తెలుసా! `అర్జున్ వ‌ర్మ‌`. .. అదేనండి..

తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన `అర్జున్ రెడ్డి` సినిమాకు త‌మిళ రీమేక్‌. విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ముందు బాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ప్ప‌టికీ నిర్మాత‌లు అవుట్ పుట్ ప‌ట్ల హ్యాపీగా లేక‌పోవ‌డంతో బాల స్థానంలో తెలుగు `అర్జున్ రెడ్డి` చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన గిరీశ‌య్య‌.. ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగులో మహేష్ బావ సంజ‌య్ క‌పూర్ ప్లేస్‌లో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ న‌టించ‌బోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.