కర్రి బాలాజీ 'బ్యాక్ డోర్' కచ్చితంగా విజయం సాధిస్తుంది: డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు

  • IndiaGlitz, [Wednesday,October 27 2021]

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన 'బ్యాక్ డోర్' చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి క్లీన్ యు సెన్సార్ సర్టిఫికెట్ లభించడం తెలిసిందే.

తాజాగా బ్యాక్ డోర్ చిత్రం ట్రైలర్ లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేసి ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ... బ్యాక్ డోర్ టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు.

లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల- చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!

More News

'రంగమార్తాండ' కు మెగాస్టార్ గాత్ర దానం

తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు పెద్ద దిక్కుగా వున్నారు మెగాస్టార్ చిరంజీవి.

రాధేశ్యామ్:  'ప్రేరణ' ఎవరు, విక్రమాదిత్యతో పరిచయం ఎలా.. పూజా హెగ్డేపై టీజర్!

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’.

బిగ్‌బాస్ 5 తెలుగు: కెప్టెన్సీ కోసం పాడరాని పాట్లు.. పేడలో షణ్ముఖ్, చెమట చిందించిన శ్రీరామ్

బిగ్‌బాస్ 5 తెలుగులో 51వ రోజు ఎపిసోడ్స్ కాస్త ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ల మేళవింపుగా సాగింది.

‘వరుడు కావలెను‘ లో భూమి పాత్ర చాలా ఛాలెంజింగ్ అనిపించింది - రీతువర్మ

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వరుడు కావలెను' సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి వస్తోంది.

యూత్ తో పాటు ఫ్యామిలీ అంతా చూసే సినిమా రొమాంటిక్ - హీరో ఆకాష్ పూరి

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది.