close
Choose your channels

రవితేజకు కథను వినిపించడానికి రెడీ అవుతున్న మారుతి!

Saturday, January 11, 2020 • తెలుగు Comments

రవితేజకు కథను వినిపించడానికి రెడీ అవుతున్న మారుతి!

‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఇచ్చిన కిక్కులో డైరెక్టర్ మారుతి ఉన్నారు. సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ చిత్రంగా నిల‌వ‌డంతో పాటు సాయితేజ్ కెరీర్‌లోనే బెస్ట్ హిట్ మూవీ అయ్యింది.  ఆ సినిమా సక్సెస్‌తో మారుతికి అవకాశాలు వచ్చి పడుతున్నాయి. సినిమా చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, డీవీవీ దానయ్య.. ఇలా వరుసపెట్టి పేర్లు వినపడుతున్నాయి. అయితే వీరిలో ఎవరు సినిమా చేస్తారన్న విషయం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మాస్‌రాజా రవితేజ కోసం మారుతి ఓ కథ రెడీ చేసినట్టు తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం ‘డిస్కోరాజా’ షూటింగ్ పూర్తి చేసుకుని క్రాక్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు క్రాక్ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. వీటి తర్వాత సినిమా మారుతితోనేనన్న ప్రచారం జరుగుతోంది.

అంతా పూర్త‌యిన త‌ర్వాత మారుతి కథను రవితేజ వింటారని సమాచారం. అది ఓకే అయితే వచ్చే ఏప్రిల్‌లోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే మారుతి.. రవితేజకు ఎలాంటి కథను వినిపించనున్నారనే వార్త టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది

Get Breaking News Alerts From IndiaGlitz