Vyuham: ఏపీ రాజకీయాలపై వర్మ 'వ్యూహం' .. వైఎస్ భారతిగా నటించేది ఈమె..?

  • IndiaGlitz, [Thursday,June 01 2023]

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేస్తూ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘‘వ్యూహం’’. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం, ఆయన పొలిటికల్ ఎంట్రీ తదితర అంశాల ఇతివృత్తంతో వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తన సినిమాల్లో నటించే క్యారెక్టర్లు .. నిజజీవితంలోని వ్యక్తులకు దగ్గరగా వుండాలని వర్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఇప్పుడు జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతీలుగా ఎవరిని ఆయన ఎంచుకుంటారని ప్రచారం జరిగింది. దీనికి చెక్ పెడుతూ వైఎస్ జగన్ , భారతీ పాత్రను పోషించబోయే నటీనటుల వివరాలను పంచుకున్నారు.

జగన్‌గా అజ్మల్, భారతిగా మానస :

వ్యూహంలో సీఎం జగన్ పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్.. వైఎస్ భారతీ పాత్రలో మానస నటించనున్నట్లు వర్మ తెలిపారు. అంతేకాదు.. సినిమా స్టిల్స్‌ను కూడా ఆయన విడుదల చేశారు. ఇందులో వైఎస్ఆర్ ఫోటోపై చేతిని పెట్టి ఏదో ఆలోచిస్తున్న ఫోజులో అజ్మల్ కనిపించారు. ఇక అన్నింటిలోకి మానస అయితే అచ్చుగుద్దినట్లు వైఎస్ భారతీని దించేశారు. వస్త్రధారణ, హావభావాలు అన్ని ఆమెను గుర్తుకుతెస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైఎస్ జగన్ బయోపిక్ అంటూ ప్రచారం :

ఈ సినిమాను గతేడాదే అనౌన్స్ చేశారు వర్మ. వ్యూహం, శపథం పేరుతో రెండు పార్టులుగా సినిమా వుంటుందని తెలిపారు. ఇది వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ బయోపిక్కేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ వర్మ మాత్రం స్పందించలేదు. తాజాగా తన వ్యూహం ప్రాజెక్ట్ విషయంలో కదలిక తెచ్చారు రామ్ గోపాల్ వర్మ. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తాను అతి త్వరలో ‘వ్యూహం’ అనే పొలిటికల్ మూవీ తియ్యబోతున్నానని.. అందరూ అనుకున్నట్లుగా ఇది బయోపిక్‌ కాదని, బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌ అని వర్మ తెలిపారు.

నూటికి నూరు పాళ్లు నిజాలే చెబుతారట :

బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్‌ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని వర్మ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇందులో జగన్‌ పాత్రలో అజ్మల్‌, భారతి పాత్రలో మానస నటించనున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ అని చెప్పారు వర్మ. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్.

More News

GDP: ఇండియాలో జీడీపీ వృద్ధిరేటు పరుగులు.. సవాళ్ల మధ్య అసాధారణ ఫలితాలు, నిపుణులు ఏమంటున్నారంటే..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ధిక మాంద్యపు భయాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దిగ్గజ కంపెనీలన్నీ కాస్ట్ కాటింగ్ పేరుతో ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Vyooham: ఆర్జీవీ కొత్త సినిమా 'వ్యూహం': బయోపిక్ కాదు, రియల్‌ పిక్ అంట.. ఎవరినీ టార్గెట్ చేశారో..?

సమకాలీన అంశాలు, రాజకీయాలను ఆధారంగా చేసుకుని సినిమాలు చేయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మది విలక్షణమైన శైలి. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు.

నీ బిల్డప్ ఏందయ్యా .. వేదవ సోది, ముందు కొవ్వు కరిగించు : కేశినేని నానికి పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, విభజిత ఏపీ అయినా బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే వుంటాయి. పొలిటికల్‌గా అత్యంత చైతన్యంగా వుండటం,

Vimanam Trailer: ఏడిపించేసిన తండ్రీకొడుకులు.. ఓ అందమైన కల, భావోద్వేగాల చుట్టూ తిరిగే 'విమానం'

శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్కస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘‘విమానం’’. విలక్షణ నటుడు , దర్శకుడు సముద్రఖని ఇందులో

Guntur Kaaram: గుంటూరు కారం కోసం ఎన్టీఆర్ ట్యాగ్‌లైన్ లేపేసిన త్రివిక్రమ్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

కోట్లాది మందిని అలరిస్తూ.. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తోన్న చిత్ర పరిశ్రమ నానాటికీ వృద్ధి చెందుతోన్న సంగతి తెలిసిందే.