సినిమాలను నియంత్రించినట్లు.. వీటిని కంట్రోల్ చేయగలారా: ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ ప్రముఖులు- ఏపీ మంత్రులు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎంట్రీతో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్ల వర్షం కురిపించారు. ఇదే సమయంలో తనకు అపాయింట్‌మెంట్ ఇస్తే సినీ పరిశ్రమ సమస్యల గురించి తెలియజేస్తామని వర్మ .. మంత్రి నానిని కోరారు.

దీనిపై స్పందించిన ఆయన త్వరలోనే కలుద్దామంటూ చెప్పారు. దీనిలో భాగంగా.. సినిమా టికెట్‌ ధరల విషయం చర్చించేందుకు తనను మంత్రి పేర్ని నాని ఆహ్వానించారని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. అమరావతి సచివాలయంలో జనవరి 10న మధ్యాహ్నం వీరిద్దరి మధ్య భేటీ జరగనుంది.

మాటల యుద్ధం సద్దుమణిగింది అనుకున్న సమయంలో వర్మ శనివారం మరోసారి ట్విట్టర్‌కు పనిచెప్పారు. సినిమా మాదిరిగానే థీమ్‌ పార్కులు, మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌, మ్యాజిక్‌ షోలు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ కిందకే వస్తాయి. వీటి ధరల్ని కూడా ప్రభుత్వం నిర్ణయించదు’’ అని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరో రెండ్రోజుల్లో సినిమా టికెట్ ధరల అంశంపై మంత్రి పేర్ని నానిని కలవనున్న ఆర్జీవీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. పరిస్ధితి చూస్తుంటే.. తెగేవరకూ లాగేందుకే రామ్‌గోపాల్ వర్మ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి ఏపీ ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

More News

బెజవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య.. సత్రంలో తల్లీకొడుకు, కృష్ణానదిలో దూకి తండ్రీకొడుకు

ఇటీవల కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్ చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

గుర్తుపట్టలేనంతంగా మారిపోయా.. మైండ్ బ్లాంక్ అయ్యింది: కోవిడ్ అనుభవాలు పంచుకున్న దీపికా

దేశంలో మొదటి, రెండో దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో లక్షలాది మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో పలువురు సెలబ్రెటీలు సైతం వున్నారు.

తమిళ చిత్ర సీమలో కోవిడ్ కలకలం.. కట్టప్పకు పాజిటివ్, పరిస్ధితి విషమం..?

సినీ పరిశ్రమలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే కమల్ హాసన్, విక్రం, వడివేలు, మహేశ్‌బాబు , మంచు లక్ష్మి, త్రిష, మీనా

కరోనాతో ఐసీయూలో .. రెండు రోజుల్లో నా శవానికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్ కంటతడి

2019 చివరిలో చైనాలో పుట్టిన కోవిడ్ మహమ్మారి మనిషిని నాలుగు గోడల మధ్య బందీని సంగతి తెలిసిందే.

సస్పెన్స్‌కు తెర.. ఉద్యోగులకు 23 శాతం పీఆర్‌సీ ప్రకటించిన జగన్

గత కొన్ని నెలలుగా ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించింది.