రాజ‌మౌళికి ఛాలెంజ్ విసిరిన ద‌ర్శ‌కుడు..

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశం యావ‌త్తు లాక్‌డౌన్‌లో ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కొత్త వారిని ఇంటికి ర‌ప్పించాలంటే అంద‌రూ ఆలోచ‌నలో ప‌డుతున్నారు. సినీ సెల‌బ్రిటీలు అయితే ఇళ్ల‌కు ప‌నివారిని కూడా ర‌ప్పించ‌డం లేదు. ఎవ‌రి ఇంటి ప‌నుల‌ను వాళ్లే చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ఓ స‌రికొత్త ఛాలెంజ్‌ను ద‌ర్శ‌ధీరుడు రాజ‌మౌళికి విసిరారు. ఆ ఛాలెంజ్ పేరు ‘బీ ది రియ‌ల్ మేన్‌’. సాధారణంగా పురుషులు ఇంటి ప‌నుల‌ను చ‌క్క‌గా చేస్తారు. ఇలాంటి క్వారంటైన్ స‌మ‌యంలో ప‌ని మ‌నుషులు ఇళ్ల‌కు రావ‌డానికి ఆలోచిస్తున్న స‌మ‌యంలో ఇంట్లోని స్త్రీల‌తో ప‌నులు చేయించ‌ని వాడే నిజ‌మైన మ‌గాడు అని ట్వీట్ చేశాడు సందీప్ వంగా. దీంతో పాటు ఆయ‌న ఇంటి ప‌నుల‌ను చేస్తున్న వీడియోను కూడా అప్ లోడ్ చేశాడు. ఈ ఛాలెంజ్‌ను వ్యాప్తి చేయాలంటూ.. అందుకోసం ఇంటి ప‌నుల‌ను చేస్తున్న వీడియోను పోస్ట్ చేయాలంటూ రాజ‌మౌళిని కోరారాయ‌న‌.

ఓకే చెప్పిన జ‌క్క‌న్న‌:

సందీప్ వంగా ఛాలెంజ్‌కు ఓకే చెప్ప‌డానికి రాజ‌మౌళి ఎక్కువ స‌మ‌యాన్ని తీసుకోలేదు. వెంట‌నే ఓకే చెప్పేశారు. త‌ను వీడియోను రేపు అప్‌లోడ్ చేస్తాన‌ని రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. మ‌రి రేపు రాజ‌మౌళి ఎలాంటి వీడియోను అప్‌లోడ్ చేయ‌బోతున్నారోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

More News

హైదరాబాద్‌లో మరో పోలీస్‌కు కరోనా.. ఎలా వచ్చింది!?

రోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో జనాలను బయటికి రానివ్వకుండా.. కరోనాపై పోరుల చేస్తున్న వైద్యులు, పోలీసులను సైతం ఈ మహమ్మారి కాటేస్తోంది.!

ఉద్యోగులను తొలగించొద్దు..: కంపెనీలకు కేటీఆర్ విజ్ఙప్తి

ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగించవద్దని పరిశ్రమ వర్గాలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేకంగా కేటీఆర్ ప్రత్యేకంగా లేఖ

నూజివీడులో ఇంటింటికీ సరుకులు పంచిన వ్యక్తికి కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఊహించని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా కేసులు సంఖ్య

మహేశ్ స‌ర‌స‌న 'సాహో' బ్యూటీ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన

ఎన్టీఆర్ బ‌ర్త్ డే ట్రీట్ డౌటే!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్