దాన్ని ట‌చ్ చేయ‌న‌న్న డైర‌క్ట‌ర్‌

  • IndiaGlitz, [Monday,June 17 2019]

ట‌చ్చేంటి? దాన్ని అంటే దేన్ని? ఆ డైర‌క్ట‌ర్ ఎవ‌రు? తొంద‌ర‌గా స‌మాధానం చెప్పండి. మా పాటికి మేం మాడిపోయిన మ‌సాలా దోస తింటుంటే క‌నిపించీ క‌నిపించ‌న‌ట్టు, చూపించీ చూపించ‌న‌ట్టు జ్యోతిల‌క్ష్మిలాగా ఆ హెడ్డింగేంటి? అని అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఆ డైర‌క్ట‌ర్ పేరు స్వ‌రూప్‌. ఆయ‌న తీసిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌. ఈ నెల 21న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగ ఆయ‌న హైద‌రాబాద్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పారు.

''నాకు చిరంజీవిగారు న‌టించిన 'చంట‌బ్బాయి' అంటే చాలా ఇష్టం. ఆ సినిమా నా దృష్టిలో గొప్ప క్లాసిక్‌. అందుకే ఆ సినిమాను ట‌చ్ చేయ‌లేదు. కాక‌పోతే ఆ జోన‌ర్‌లో మా సినిమా ఉంటుంది. చంట‌బ్బాయిలోలాగా మా సినిమాలోనూ కామెడీ టింజ్ ఉంటుంది. నా బ‌లం కూడా కామెడీనే. దానికి తోడు థ్రిల్లింగ్ క‌లిగించే అంశాలు కూడా జోడిస్తాను'' అని అన్నారు. స్వ‌రూప్ సొంత ఊరు నెల్లూర‌ట‌. ఆయ‌న‌కు ఆత్రేయ ఇష్ట‌మ‌ట‌. అందుకే త‌న సినిమా పేరులో ఆత్రేయ‌ను కూడా చేర్చుకున్నారు. న‌వీన్ ఇందులో క‌థానాయ‌కుడు. 'మ‌ళ్లీరావా'లాంటి చిత్రాన్ని తీసిన అభిరుచిగ‌ల నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ సినిమాకు నిర్మాత‌.