అమ్మాయిలూ.. కండోమ్స్ పెట్టుకోండి.. రేప్‌కు సహకరించండి: డైరెక్టర్

  • IndiaGlitz, [Wednesday,December 04 2019]

గత కొన్నిరోజులుగా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఏ నోట చూసినా వినిపిస్తున్న మాట ‘దిశ ఘటన’.. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఉరితీయాల్సిందేనని సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు న్యాయవాదులు సైతం నిందితుల తరఫున వాదించమని తేల్చిచెప్పేశారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. అయితే తాజాగా ఓ ప్రముఖ డైరెక్టర్ డేనియల్ శ్రవణ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా ఇలాంటి వ్యక్తే ఇలా మాట్లాడటం సిగ్గు చేటు.. సభ్య సమాజం తలదించుకోవాల్సి వచ్చినంత పనైంది. ఇదిగో ఈ పక్క ఫొటోలని వ్యక్తే ఆ మాటలు అన్నది.

కండోమ్స్ పెట్టుకోండి.. సహకరించండి!
‘అమ్మాయిలు హత్యలకు గురికాకుండా ఉండాలంటే ఆడవాళ్లు అత్యాచారం చేస్తున్నప్పుడు సహకరించండి. రేపిస్ట్‌లు ఆడవాళ్లపై అత్యాచారం చేసి చంపడానికి కారణం మహిళా సంఘాలు, సమాజమే. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, మహిళా సంఘాలు రేప్‌ని, రేపిస్ట్‌లను లీగల్ చేస్తే అత్యాచారం చేశాక చంపాలన్న ఆలోచన రేపిస్ట్‌లకు రావు. దిశా హత్యకు ఆ నలుగురూ కాదు.. ప్రభుత్వం, మహిళా సంఘాలే కారణం. ఆడవాళ్లను రేప్ చేసేటప్పుడు వారు సహకరించాలి. లేకపోతే ఎక్కడ పోలీసులకు చెప్తారోనన్న భయంతో మగాళ్లు చంపేస్తారు. ప్రభుత్వం రేపిస్ట్‌లపై చట్టాలను రుద్దకపోతే వాళ్లు కూడా ఆడవాళ్లను హత్యలు చేయరు. రేప్ అనేది సీరియస్ విషయం కాదు. కానీ హత్య చాలా పెద్ద నేరం. ఆడవాళ్లపై అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే రేప్‌లను లీగలైజ్ చేయడం ఒక్కటే పరిష్కారం. పోలీసులకు ఫోన్ చేసే బదులు కండోమ్స్ పెట్టుకోండి. వందకి నా బొందకి ఫోన్లు చేసేకంటే పర్సులో కండోమ్స్ పెట్టుకుంటే మంచిది. దీని వల్ల ప్రాణాలు దక్కుతాయి. కండోమ్‌లతోనే మహిళలకు రక్షణ ఉంటుంది. నిర్భయ చట్టంతో కాదు’ అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

చర్యలుంటాయా..!?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ దిశ ఘటనపై స్పందిస్తూ పై విధంగా ఆ డైరెక్టర్ రియాక్ట్ అయ్యాడు. అయితే ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు సెలబ్రిటీలు నెట్టింట్లో ఆయన్ను బంతాట ఆడుకుంటున్నారు. సింగర్ చిన్నయి శ్రీపాదతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఆయనపై కామెంట్స్ చేస్తు్న్నారు. అయితే సెన్సేషనల్ కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో..? లేకుంటే తనకు పబ్లిసిటీ కావాలని హడావుడి చేశాడో తెలియదు కానీ డైరెక్టర్ డేనియల్ శ్రవణ్ ఇప్పుడు నలుగురి నోళ్లలో నలుగుతున్నారు. అయితే.. నెట్టింట్లో ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారినే హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరి ఆ డైరెక్టర్‌పై అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

More News

సెన్సార్‌ బోర్డుకే వార్నింగ్ ఇచ్చిన షకీల!

అవును ఇదేదో రీల్ లైఫ్‌లో అనుకునేరు.. కాదండోయ్.. రియల్ లైఫ్‌లో అదీ కూడా సినిమాలకు సర్టిఫికెట్స్ ఇచ్చే సెన్సార్ బోర్డుకు సీనియర్ నటి షకీల వార్నింగ్ ఇచ్చింది.

20 ఏళ్ల అపురూప జ్ఞాపకాల సాక్ష్యం 'నీ కోసం'

తెలుగు సినిమా పుట్టుక మొదలు ఎన్నో సినిమాలు వస్తున్నాయి...పోతున్నాయి.

'ఎర్ర‌చీర‌' లో తొలి తొలి ముద్దు రొమాంటిక్ గీతం

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢ‌మరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `ఎర్రచీర`. సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు

‘విక్రమ్’ ల్యాండర్ జాడపై ఏంటీ కన్ఫూజన్.. కన్ఫూజన్!

ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపగా..

కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న ల‌వ్‌స్టోరీ `మిస్ మ్యాచ్‌` ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - హీరో ఉద‌య్ శంక‌ర్‌

'ఆటగదరా శివ' లాంటి డీసెంట్‌ హిట్‌ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్‌ హీరో ఉదయ్‌ శంకర్‌.