close
Choose your channels

న‌టుడిగా మారుతున్న ద‌ర్శ‌కుడు

Sunday, November 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

న‌టుడిగా మారుతున్న ద‌ర్శ‌కుడు

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ త్వ‌ర‌లోనే న‌టుడిగా తెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నారు. ఏ సినిమాలో అని అనుకుంటున్నారా? వివ‌రాల్లోకెళ్తే.. సెల్వ రాఘ‌వ‌న్ అసోషియేట్ ఒక‌రు త్వ‌ర‌లోనే ఓ సినిమా చేయ‌బోతున్నార‌ట‌. స‌ద‌రు అసోసియేట్ త‌న సినిమాలో ఓ రోల్‌ను సెల్వ‌రాఘ‌వ‌న్‌కు ఆఫ‌ర్ చేశాడ‌ట‌.

సెల్వ‌రాఘ‌వ‌న్ ఏమీ చెప్ప‌లేదు కానీ.. న‌వ్వి ఊరుకున్నాడ‌ట‌. న‌వ్వు అర్ధాంగీకార‌మే క‌దూ! అనిపిస్తుంది. అంటే త్వ‌ర‌లోనే సెల్వ రాఘ‌వ‌న్‌ను త్వ‌ర‌లోనే న‌టుడిగా కూడా చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌. సెల్వ‌రాఘ‌వ‌న్ ప్ర‌స్తుతం సూర్య `ఎన్‌.జి.కె` చిత్రంతో బిజీ బిజీగా ఉన్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.