close
Choose your channels

ఈ షూటింగ్ స్పాట్ యమా డేంజర్!?

Thursday, February 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈవీపీ స్టూడియో చెన్నైలో బాగా ఫేమస్.. కోలీవుడ్‌కు సంబంధించిన పెద్ద పెద్ద సినిమాల షూటింగ్‌లు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయ్. పైగా స్టూడియో కూడా చాలా పెద్దది కావడంతో భారీ సెట్లు వేసుకోవడానికి అనువుగా ఉంటుందని.. భారీ బడ్జెట్ మూవీల దర్శకనిర్మాతలకే ఈ స్టూడియోకే ప్రాధాన్యతనిస్తుంటారు. అయితే గత రెండు మూడేళ్లుగా ఈ స్టూడియోలో సెట్ వేస్తే చాలు ఏదో ఒకరూపంలో ప్రమాదం జరగడం.. తద్వారా కనీసం ఒకరిద్దరైనా చనిపోవడం జరుగుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా మొదలుకుని ఇప్పటి వరకూ ప్రమాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయ్.

జంకుతున్నారు..!
ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయట. దీంతో ఆ స్టూడియోలో సెట్ వేయాలని కాదు కదా.. ఆ పేరు వింటేనే దర్శకనిర్మాతలు జంకుతున్నారట. నాడు అనగా మూడేళ్ల క్రితం రజనీ ‘కాలా’ సినిమాలో షూటింగ్ మొదలుకుని నేటి ‘భారతీయుడు-2’ వరకూ ఈ స్టూడియోలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకూ జరిగిన ప్రమాద తాలుకు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘కాలా’ సెట్‌లో ప్రమాదం!

స్టార్ రజనీకాంత్ ‘కాలా’ షూటింగ్ సెట్‌లో చోటుచేసుకున్న అనుకోని ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తగలడంతో ఓ టెక్నీషియన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పట్లో ఈ ఘటనతో ఒక్కసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.

బిగ్‌బాస్ షోలోనూ ప్రమాదం!

తమిళ బిగ్‌బాస్‌కు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈవీపీ స్టూడియోలో షూటింగ్ చేస్తుండగా సెకండ్ ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో ఒకరు మృతి చెందారు.

‘బిగిల్’ సినిమా షూట్‌లో..!

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’ సినిమా షూటింగులో సెల్వరాజ్ అనే ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. వంద అడుగుల ఎత్తున ఉన్న క్రేన్ కి కట్టిన ‌ లైట్ కింద పడడంతో అతడిని మృత్యువు కబళించింది.

తాజాగా మరో ఘోరం!

‘భారతీయుడు-2’ సినిమా షూటింగ్‌లో భాగంగా సెట్స్ వేస్తుండగా 150 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా క్రేన్ తెగిపడి టెంట్‌పై పడటంతో ముగ్గురు టెక్నీషియన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సహాయ దర్శకుడు కృష్ణ (34), సహాయకుడు చంద్రన్ (60) ఉన్నారు. మరో పదిమందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.

ఇలా వరుస ఘటనలు.. అది కూడా ఒకే స్టూడియోలో జరగడంతో అసలేమై ఉంటుంది..? ఇంతకీ వాస్తు ప్రకారమే స్టూడియో కట్టారా లేదా..? ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా పదే పదే ఎందుకిలా జరుగుతోంది..? అని అటు సినిమా ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు.. జనాలు ఆలోచనలో పడ్డారు. మరి ఫైనల్‌గా ఏం తేలుతుందో..? మున్ముంథు ఇలాంటి స్టూడియోలకు దర్శకనిర్మాతలు దూరంగా ఉండి డేంజర్ స్పాట్‌గా గుర్తించేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.