close
Choose your channels

పోర్న్ కెరీర్‌ ఎంచుకున్న డైరెక్టర్ కుమార్తె.. ఆర్జీవీ కామెంట్ ఇదీ

Thursday, February 20, 2020 • తెలుగు Comments

పోర్న్ కెరీర్‌ ఎంచుకున్న డైరెక్టర్ కుమార్తె.. ఆర్జీవీ కామెంట్ ఇదీ

అవును మీరు వింటున్నది నిజమే.. ఓ ప్రముఖ డైరెక్టర్ కుమార్తె పోర్న్ కెరీర్‌ను ఎంచుకుంది. అంతేకాదండోయ్.. ఆమె ఎంచుకున్న కెరీర్‌ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఏ మాత్రం అడ్డుచెప్పలేదు. ఆమెకు స్వేచ్ఛ ఇచ్చారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనే తెలుసుకోవాలని ఉంది కదూ.. మన టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అస్సలు కాదులెండి..? ఇది అమెరికాలో జరిగిన వ్యవహారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? ఆర్జీవీ ఏమని కామెంట్స్ చేశాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అసలేంటి కథ!?

అమెరికన్ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దత్త పుత్రిక 23 ఏళ్ల వయసున్న మికేలా పోర్న్ చిత్రాల్లో నటించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తనను పెంచిన తండ్రికి చెప్పగా.. ఆయన అడ్డు చెప్పకుండా ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఓకే అనేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్టీవెన్, మికేలా వెల్లడించారు. కొందరు ఈమె తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం ఇదేం పోయే కాలం రా బాబోయ్.. వేరే రంగాలేమీ లేవా..? అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై వివాదాలే ఊపిరిగా బతికే ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.

ఆర్జీవీ ఏమన్నాడు!?

‘అమెరిక‌న్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ కూతురు పోర్న్ కెరీర్‌ని ఎంచుకుంది. దీనికి పెంచిన తండ్రిగా ఆయన మద్దతు తెలిపారు. మికేలా నిర్ణయాన్ని స్పీల్‌బ‌ర్గ్ ఎంత‌గానో స‌మ‌ర్థించారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచం క్రమంగా అభివృద్ధి చెందుతోంది’ అని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. అయితే ఆర్జీవీ ట్వీట్‌పై చిత్ర విచిత్రాలుగా నెటిజన్లు, వీరాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వృత్తే ఎందుకంటే..!

వాస్తవానికి కొంతకాలంగా మికేలా సొంతంగా పోర్న్ వీడియోలను నిర్మిస్తోంది. మరోవైపు తనకు ఇష్టమైన స్ర్టిప్‌ క్లబ్‌లో ఎంట్రీ కోసంస్ర్టిప్పర్‌ లైసెన్స్‌ పొందేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. మికేలా తన స్టేజ్‌ నేమ్‌ను షుగర్‌ స్టార్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి.. తాను ఎంచుకున్న వృత్తి గురించి చెప్పుకొచ్చింది. 

సోలో వీడియోలే చేస్తా!

‘ నా చిన్నతనంలో కుంగుబాటుకు గురయ్యాను. లైంగిక వేధింపులకు లోనయ్యాను. ఈ వృత్తి పట్ల వ్యామోహం ఉండటం సిగ్గుపడే విషయం ఎంతమాత్రం కాదు.. నేను ఇప్పుడిప్పుడే అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ కెరీర్‌ను చేపట్టాను. ఇది సానుకూల, సాధికారిక నిర్ణయమని, సురక్షిత, పరస్పర అంగీకారమైన పనులు చేపట్టాలని కోరుకుంటున్నాను. నేను ఫలానా నిర్ణయం తీసుకున్నానని తల్లిదండ్రులు ఆశ్చర్యపోలేదు. అంతేకాదు.. కాబోయే భర్త చక్‌ పాంకో (47) సైతం పోర్న్‌ స్టార్‌గా నా ఎంట్రీకి మద్దతుగా నిలిచాడు. నా అభిమానుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వైట్‌మెన్‌లను ఎంపిక చేసుకుంటాను. పాంకోపై గౌరవంతో నేను కేవలం సోలో వీడియోలే చేస్తాను. ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవు’ అని క్లారిటీగా చెప్పింది.

Get Breaking News Alerts From IndiaGlitz