ఆ ఇద్దరికి ఈసారీ నిరాశే

  • IndiaGlitz, [Sunday,April 03 2016]

గ‌త నెల‌లో వారం గ్యాప్‌లో సంద‌డి చేసిన ఆ ఇద్ద‌రు క‌థానాయ‌కులు.. ఈ నెల తొలి రోజున త‌మ కొత్త చిత్రాల‌తో పోటాపోటీగా సంద‌డి చేశారు. అయితే.. రెండు సంద‌ర్భాల్లోనూ ఈ ఇద్ద‌రికి నిరాశ‌క‌ర‌మైన ఫ‌లితాలే ద‌క్కాయి. ఇంత‌కీ ఆ క‌థానాయ‌కులు ఎవ‌రంటే.. మంచు మ‌నోజ్‌, నారా రోహిత్‌. ఈ వారంలో ఈ ఇద్ద‌రు హీరోలుగా న‌టించిన ఎటాక్‌, సావిత్రి చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. అయితే.. ఈ రెండు చిత్రాల‌కు విమ‌ర్శ‌కుల నుంచి గానీ, ప్రేక్ష‌కుల నుంచి గానీ పాజిటివ్ రెస్పాన్స్ లేదు. దీంతో గ‌త నెల‌లో వ‌చ్చిన శౌర్య త‌రువాత మ‌నోజ్ కి ఎటాక్‌ రూపంలో.. తుంట‌రి త‌రువాత నారా రోహిత్ కి సావిత్రి రూపంలో.. మ‌రోసారి నిరాశే ఎదుర‌య్యింది. రాబోయే చిత్రాల‌తోనైనా ఈ ఇద్ద‌రికి విజ‌యాలు దొర‌కాల‌ని ఆశిద్దాం.

More News

అరరే..సురభి మిస్సయ్యిందే

రెండు వరుస విజయాలు అందుకున్నాక ఎవరైనా మూడో విజయం కోసం ఆశపడడం సహజం.ఢిల్లీ సుందరి సురభి కూడా ఇందుకు మినహాయింపు కాదు.

మహేష్ రికార్డ్....

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ..ఇప్పుడు ఇండస్ట్రీ బాక్సాఫీస్ తారక మంత్రం.

'సుప్రీమ్' ఆడియో, మూవీ రిలీజ్ డేట్....

పిల్లా నువ్వులేని జీవితం’,‘సుబ్రమణ్యం ఫర్ సేల్’చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘సుప్రీమ్’.

'పోలీసోడు' సెన్సార్ పూర్తి....

విజయ్,సమంత,ఎమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రుపొందిన చిత్రం 'తెరి'.

ఊపిరి సీక్వెల్ ప్రకటించిన నాగ్

నాగార్జున-కార్తీ -తమన్నా కాంబినేషన్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి చిత్రం అటు తమిళ్-ఇటు తెలుగులో ఫీల్ గుడ్ మూవీగా విమర్శకుల ప్రశంసలందుకుంటుంది.