close
Choose your channels

ఆర్జీవీ బాట‌లో ఆయ‌న శిష్యుడు!!

Wednesday, August 5, 2020 • తెలుగు Comments

ఆర్జీవీ బాట‌లో ఆయ‌న శిష్యుడు!!

ద‌ర్శ‌క నిర్మాత‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ వూర‌ఫ్ ఆర్జీవీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు సోష‌ల్ మీడియా పుణ్య‌మాని రోజుకొక‌సారి వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఆర్జీవీ సినిమాలు త‌న‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్లు తెర‌కెక్కిస్తుండొచ్చు కానీ.. ఒక‌ప్పుడు ఆయ‌న చేసిన అద్భుత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించారు. ఆయ‌న ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకోవ‌డ‌మే కాదు.. త‌నే నిర్మాత‌గా మారి త‌న శిష్యులను కూడా ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేశారు. పరిచ‌యం చేస్తున్నారు.

ఇలా వ‌ర్మ అనే కాదు.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో సుకుమార్ కూడా ఇలాంటి పంథాలోనే త‌న డైరెక్ష‌న్ టీమ్‌లో వ్య‌క్తుల‌ను ద‌ర్శకులుగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో డైరెక్ట‌ర్ తేజ కూడా అడుగు పెడుతున్నార‌ట‌. ఆయ‌న త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోని రాకేష్‌ను ద‌ర్శ‌కుడిగా మారుస్తూ ఓ వెబ్ సినిమాను నిర్మించార‌ట‌. బోల్డ్ కంటెంట్‌తో సాగే ఈ వెబ్ సినిమా క‌థ‌ను కూడా తేజ‌నే త‌యారు చేశార‌ట‌. ఈ వెబ్ సినిమాను రూపొందించే క్ర‌మంలోనే తేజ‌కు క‌రోనా సోకింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz