close
Choose your channels

గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసిన 'డిస్కోరాజా'

Monday, September 16, 2019 • తెలుగు Comments

గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసిన `డిస్కోరాజా`

మాస్ మ‌హారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘డిస్కోరాజా’. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘ఒక్కక్షణం’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం(తండ్రీ కొడుకులు) చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లుక్‌, ఫ‌స్ట్ లుక్‌ను విడుదల చేశారు. 1980బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈసినిమా గోవా షెడ్యూల్ ఇటీవ‌ల స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. గోవాలోని ఓ క్యాసినోవాలో షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర ఆర్ట్ డైరెక్ట‌ర్ డిస్కోరాజా అనే టైటిల్‌ను ఇసుక‌లో డిజైన్ చేసి ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేశ్‌, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంంది. గోవా షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తితో సినిమా మేజ‌ర్ పార్ట్ షూటింగ్ పూర్త‌యిన‌ట్లే. రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ కొరియ‌న్ సినిమా ఆధారంగా తెరెక్కుతుంద‌ని టాక్‌. కాగా రవితేజ తదుపరి సినిమా ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రారంభం కావాల్సిన చిత్రం నుండి రవితేజ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద వివాదమే రేగింది.

Get Breaking News Alerts From IndiaGlitz