close
Choose your channels

Disco Raja Review

Review by IndiaGlitz [ Friday, January 24, 2020 • தமிழ் ]
Disco Raja Review
Banner:
SRT Entertainments
Cast:
Ravi Teja, Payal Rajput, Nabha Natesh, Vennela Kishore, Sisir Sharam, Tony Hope
Direction:
VI Anand
Production:
Talluri Rajini
Music:
Thaman S

చిన్న రేంజ్ నుండి ఓ ఇమేజ్ ఉన్న స్టార్స్ తెలుగు సినిమాలో ఎవ‌రు అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే స్టార్స్‌లో ర‌వితేజ ఒక‌డు. క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వ‌చ్చిన ర‌వితేజ‌కి.. రాజాది గ్రేట్ సినిమా త‌ర్వాత హిట్ లేదు. చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయ్యాయి. ట‌చ్ చేసి చూడు, నేల‌టిక్కెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాల త‌ర్వాత ర‌వితేజ హీరోగా న‌టించిన చిత్రం `డిస్కోరాజా`. సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు ఆక‌ట్టుకుంది? ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో హిట్ కొట్టిన డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్‌.. త‌ర్వాత ఒక్క‌క్ష‌ణం సినిమాతో ప్లాప్‌ను చూశాడు. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఈ చిత్రం ఎలా ఉంది? ర‌వితేజ‌, వి.ఐ.ఆనంద్‌ల‌కు సక్సెస్ ద‌క్కిందా?  నిర్మాత‌గా రామ్ తాళ్లూరికి విజ‌యం వ‌రించిందా?  అనే విష‌యం తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ్లాల్సిందే...

క‌థ‌:

అనాథ‌ల‌తో క‌లిసి పెరిగిన అనాథ వాసు(ర‌వితేజ‌)... ఇంటి కోసం అప్పు చేసిన వాసు క‌న‌ప‌డ‌కుండా పోతాడు. అత‌నితో ఉన్న‌వారంద‌రూ కంగారుప‌డుతుంటారు. అదే స‌మ‌యంలో ల‌డ‌క్‌లో మంచులో ఓ శవం గ‌డ్డ‌క‌ట్టుకుని ఉంటుంది. ప్రాణాలు పోయిన మ‌నుషుల‌కు ప్రాణాలు చేసే ఓ డాక్ట‌ర్స్ బృందం ఆ శ‌వాన్ని తీసుకొచ్చి ప్రాణాలు పోస్తుంది. ప్రాణాలు వ‌చ్చిన వ్య‌క్తికి ఏమీ గుర్తుండ‌దు. అత‌ను త‌న జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఆ క్ర‌మంలో కొంద‌రు వ్య‌క్తులు అత‌న్ని చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అత‌డు వాసు అని అత‌ని స్నేహితులు అత‌న్ని క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. కానీ మంచు కొండ‌ల్లో వ్య‌క్తి 35 ఏళ్ల క్రితం చనిపోయిన వ్య‌క్తి అని డాక్ట‌ర్స్ అంటారు. అలా 35 ఏళ్ల క్రితం చ‌నిపోయిన ఆ వ్య‌క్తే డిస్కో రాజా అని తెలుస్తుంది. డిస్కోరాజా ఎవ‌రు?  డిస్కోరాజాకు, వాసుకి ఉన్న లింకేంటి?  అలాగే డిస్కోకి, సేతుకి ఉన్న గొడ‌వేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

స‌మీక్ష‌:

ర‌వితేజ‌:  టైటిల్ పాత్ర‌ధారిగానే కాకుండా.. హీరో కొడుకు పాత్ర‌లోనూ ర‌వితేజ‌నే న‌టించాడు. రెండు పాత్ర‌ల్లో చ‌క్క‌గా వేరియేష‌న్ చూపించాడు. ఇద్ద‌రి వ‌య‌సులు ఒకేలా క‌న‌ప‌డ‌టం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాలో లుక్ ప‌రంగా ర‌వితేజ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌న‌క్క‌ర్లేకుండా పోయింది. ముఖ్యంగా డిస్కోరాజా పాత్ర‌ను ర‌వితేజ లుక్ ప‌రంగా, ఎన‌ర్జీ ప‌రంగా చ‌క్క‌గా క్యారీ చేశాడు. సెకండాఫ్ అంతా డిస్కోరాజా క్యారెక్ట‌ర్ సినిమాను న‌డిపించింది. అలాగే ఇంట‌ర్వెల్ బ్లాక్‌లో ర‌వితేజ ఎనర్జీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. కొడుకు పాత్ర‌లో న‌టించిన ర‌వితేజ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ క‌న‌ప‌డ‌లేదు.

హీరోయిన్స్‌: ఈ చిత్రంలో పాయిల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేశ్‌, తాన్యా హోప్ ముగ్గురు హీరోయిన్స్ న‌టించారు. ఈ ముగ్గురిలో పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర‌కే ప్రాధాన్య‌త ఎక్కువ‌గా క‌న‌ప‌డింది. పాయ‌ల్ ఓవ‌ర్ గ్లామ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌కుండా.. పరిధి మేర మాట‌లు రానీ, చెవులు విన‌ప‌డ‌ని అమ్మాయిగా చ‌క్క‌గా న‌టించింది. ఇక న‌భాన‌టేశ్ పాత్ర ప‌రిధి త‌క్కువ‌గా ఉంది. కొడుకు పాత్ర‌ధారి ర‌వితేజ జోడిగా న‌టించింది. ఇక తాన్యా హోప్ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు.

బాబీసింహ‌: ఈ సినిమాలో మెయిన్ విల‌న్‌గా సినిమా ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు బాబీసింహ పాత్ర క‌న‌ప‌డుతుంది. మ‌ద్రాసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌లిసి ఉన్న‌ప్పుడు ఉండే పాత్ర‌ధారి సేతు పాత్ర‌లో బాబీ త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు.

ఇత‌ర తారాగ‌ణం: స‌త్య‌, సునీల్‌, రాంకీ, అన్న‌పూర్ణ‌మ్మ, భ‌ర‌త్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. వీరంద‌రిలో సునీల్ పాత్ర మాత్రం పెక్యుల‌ర్‌గా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను పోషించ‌ని పాత్ర‌ను పోషించాడుసునీల్‌.

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌కుడు బాబీసింహ సైన్స్‌ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. అయితే సెకండాఫ్‌...1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా సాగ‌దీత‌గా అనిపిస్తుంది. సెకండాఫ్ విష‌యంలో కాస్త కేర్ తీసుకుని ఉండుంటే బావుండేది. క‌థ‌లోని ట్విస్టులు టర్న్‌ల‌తో సినిమా రెండున్న‌ర గంటలే అయినా మూడు గంట‌ల‌కే పైగా అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ ట్విస్టులు మాత్రం చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సంగీతంలో నువ్వు నాతో ఏమ‌న్నావో... సాంగ్ బావుంది. మిగిలిన పాట‌లు క‌థ‌లో భాంగానే న‌డిచాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ముఖ్యంగా రెట్రో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బావుంది. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సినిమా లెంగ్త్ విష‌యంలో ..ముఖ్యంగా సెకండాఫ్ విష‌యంలో ఎడిట‌ర్ కేర్ తీసుకుని ఉండుంటే ఇంకా బావుండేద‌నిపించింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

డిస్కోరాజా.. మాస్ రాజా వ‌న్ మేన్ షో

Read Disco Raja Review in English

Rating: 2.5 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE