close
Choose your channels

పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ 'డిస్కోరాజా'

Saturday, June 15, 2019 • తెలుగు Comments

పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ డిస్కోరాజా

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం "డిస్కోరాజా". ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్  రామెజిఫిల్మ్‌సిటి లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, వెన్నెల కిషోర్ ల మ‌ద్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు.త‌రువాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంది. రీసెంట్ గా పాత‌బ‌స్తి లో చాలా కీల‌క స‌న్నివేశాలు హీరో ర‌వితేజ గారు మ‌రియు ఇత‌ర న‌టీన‌టుల మ‌ద్య కీలక స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. 

ఈ లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఎంపిక ఇంకా జ‌ర‌గాల్సి వుంది. టేస్ట్ వున్న నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.  త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో భారీ సెట్ లో మేజ‌ర్ షెడ్యూల్ ని ప్రారంభిస్తారు.

Get Breaking News Alerts From IndiaGlitz