close
Choose your channels

బిగ్‌బాస్‌4కి రంగం సిద్ధ‌మ‌వుతోందా!!

Friday, May 22, 2020 • తెలుగు Comments

బిగ్‌బాస్‌4కి రంగం సిద్ధ‌మ‌వుతోందా!!

హాలీవుడ్ నుండి బాలీవుడ్ అక్క‌డ నుండి ద‌క్షిణాదికి వ‌చ్చిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. ఎప్ప‌టి నుండో నాలుగో సీజ‌న్ స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా..సోష‌ల్ మీడియాలో ఇప్పుడు బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ప్రారంభం గురించి, అందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ గురించి వార్త‌లు విన‌స‌డుతున్నాయి.

స‌మాచారం మేర‌కు హీరో త‌రుణ్‌, మంగ్లీ, జాహ్న‌వి, యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి, అఖిల్ స‌ర్తాక్ త‌దిత‌రులు పాల్గొంటార‌ని ఇప్ప‌టికే స్టార్ మా నిర్వాహ‌కులు స‌ద‌రు కంటెస్టెంట్స్‌తో మాట్లాడార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. నిజానికి క‌రోనా ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే జూన్‌లోనే బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆల‌స్యంగా ప్రారంభం అవుతుంద‌ట‌. ఇప్పుడిప్పుడే నిర్వాహ‌కులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్నీ ఏర్పాటు పూర్త‌య్యేలోపు ప్ర‌భుత్వం నుండి అనుమ‌తులు కూడా తీసుకోనున్నార‌ట‌. అంతా స‌జావుగా సాగితే జూలై నెల‌లో బిగ్‌బాస్ సీజ‌న్ 4 గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సీజ‌న్ 3కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అక్కినేని నాగార్జున, సీజ‌న్ 4లోనూ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించున్నార‌ని టాక్‌.

Get Breaking News Alerts From IndiaGlitz