ఆర్జీవీ సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి

  • IndiaGlitz, [Saturday,October 10 2020]

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాంగోపాల్‌వర్మ దిశ సినిమాపై ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దిశ ఘటనను ఆధారంగా చేసుకొని సినిమా తీయొద్దని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్‌పై స్పందించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్.. ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకు పిటిషనర్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనను పరిష్కరించాలని కేంద్రం, సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దిశ ఘటన తమ కుటుంబాన్ని తీవ్ర దుఖంలో ముంచివేసిందని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘటనను ఇంకా మరువలేకపోతున్నామన్నారు. ఇలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నారన్నారు. నవంబర్ 26న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే వర్మ ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కింద చాలా మంది అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. దీనిపై శ్రీధర్ రెడ్డి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. ఓ వైపు కూతురు కోల్పోయిన బాధలో తాముంటే... మరోవైపు ఈ కామెంట్లు, ట్రైలర్ తమను తీవ్రంగా కలిచి వేస్తున్నాయన్నారు. వ్యక్తిగత జీవితాలను కించపరిచే విధంగా సినిమాలు తీయడం సరికాదన్నారు. దీనిపై హైకోర్టుతో పాటు జాతీయ మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్‌ వేశానన్నారు. తక్షణమే ట్రైలర్‌ను డిలీట్ చేయాలని.. సినిమాను నిలిపివేయాలని శ్రీధర్‌రెడ్డి కోరారు.

దిశ సినిమా విషయంలో సెన్సార్‌ బోర్డు సూచనలు పాటిస్తామని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు. సెన్సార్‌ బోర్డు ఏమైనా సీన్లు కట్‌ చేయమంటే చేస్తామన్నారు. కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని నట్టికుమార్‌ వెల్లడించారు. దిశ తల్లిదండ్రుల్ని బాధపెట్టేలా ఈ సినిమా తీయలేదని.. సమాజంలో జరిగిన ఘటనను మాత్రమే చూపించబోతున్నామన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినంత మాత్రాన.. మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదన్నారు. ఇంకా కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. దిశ తల్లిదండ్రులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని నిర్మాత నట్టికుమార్‌ తెలిపారు.

More News

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల.. టాపర్స్‌లో తెలంగాణ విద్యార్థులు

ఏపీ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్2లో ఇంజినీరింగ్ పరీక్షకు

ఓటు హక్కుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

ఇప్పుడున్న కుర్ర హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. కొన్ని భావాల‌ను ఓపెన్‌గా చెప్ప‌డమే విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న అల‌వాటు.

వామ్మో.. రాజమౌళిపై ఇన్ని కంప్లైంట్సా?.. చెర్రీ, తారక్ కూడా..

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి ఇప్పుడు ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. టాలీవుడ్ వ‌ర‌కు ప‌రిమితం అయిన ఈ డైరెక్ట‌ర్ బాహుబ‌లితో ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో పేరును సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.

'పీన‌ట్ డైమండ్' చిత్రం ప్రారంభం

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా రూపొందుతోన్న

దిశ సినిమాపై కోర్టులో పిటిషన్‌... స్పందించిన నట్టికుమార్‌

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'దిశా ఎన్‌కౌంటర్‌'. గత ఏడాది నవంబర్‌ 26న దిశపై జరిగిన అత్యాచారం, హత్య...