దిశా రహస్య వివాహం?

  • IndiaGlitz, [Friday,January 05 2018]

బాలీవుడ్‌లో పెళ్ళిళ్ళ సీజన్ మొదైలెనట్టు కనిపిస్తోంది. ఇటీవల విరాట్ కోహ్లి, అనుష్క శర్మ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇటలీలో రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరిలాగే టైగర్ ష్రాఫ్, దిశా పటాని కూడా రహస్యంగా పెళ్ళి చేసుకున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. వీరిద్దరూ గత కొంతకాలంగాఎక్కడికి వెళ్ళి కలిసే వెళుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను శ్రీలంకలో జరుపుకున్నారు. అక్కడే రహస్యంగా పెళ్ళి చేసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరి ప్రేమకు టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ అంగీకరించినప్పటికీ తల్లి ఆయేషా మాత్రం ఒప్పుకోలేదని తెలిసింది. ఈ ప్రేమ వ్యవహారం గురించి దిశాని ప్రశ్నిస్తే.. టైగర్ ఫ్యామిలీతో నేను ఎక్కువగా కలవను'' అని చెప్పింది. ఇప్పుడు మీడియాలో వినిపిస్తున్న పెళ్ళి వార్తపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలుగులో వరుణ్‌తేజ్ హీరోగా నటించిన లోఫర్' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దిశా పటాని ప్రస్తుతం తమిళంలో సంఘమిత్ర' సినిమా చేస్తోంది. అలాగే టైగర్, దిశా జంటగా నటించిన బాఘి 2' త్వరలో విడుదల కానుంది.

More News

మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన చిత్రం స్ట్రీట్ లైట్స్.

సూర్య ఆ విషయంలో పక్కాగా ఉన్నాడు మరి...

హీరో సూర్య‘గ్యాంగ్’ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'అజ్ఞాతవాసి' కి ఇరానీ కేఫ్ ఫైట్ హైలైట్ అట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం 'అజ్ఞాతవాసి'

షామిలి.. సెకండ్ ఇన్నింగ్స్

బేబి షామిలి..ఈ పేరు వింటే ముద్దు ముద్దు మాటలు,చక్కని నటనతో మణిరత్నం తెరకెక్కించిన 'అంజలి'...

ర‌వితేజ విష‌యంలో ప్రియ‌ద‌ర్శి క‌ల నెలవేరింద‌ట‌

మాస్ మహారాజా రవితేజ న‌టిస్తున్న‌ కొత్త సినిమా ఈ రోజు ప్రారంభమైంది. సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'నేల టికెట్' అనే పేరు ప్ర‌చారంలో ఉంది.