‘తగ్గేదే లే’ సినిమా నుండి దివ్యా పిళ్లై ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,November 23 2021]

టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణసంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా వారి మొదటి చిత్రం నవీన్ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు దర్శకత్వంలో రాబోతుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి ‘తగ్గేదే లే’ టైటిల్ ను పెట్టారు.

నేడు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న దివ్యా పిళ్లై ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. దివ్యా పిళ్లై పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. చీరకట్టులో అందరినీ ఆకట్టుకుంది. నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇది వరకే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు విశేషమైన ఆదరణ లభించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది.

దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, అయ్యప్ప శర్మ, నవీన్ చంద్ర, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా, చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు.

నటీనటులు: నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, అయ్యప్ప శర్మ, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్

More News

నాని చేతుల మీదుగా విడుద‌లైన ‘జయమ్మ పంచాయితీ’ నుంచి ‘తిప్పగలనా’ పాట

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు.

నాగ‌చైత‌న్య పుట్టినరోజు సంద‌ర్భంగా 'థాంక్యూ'మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

న‌వ యువ సామ్రాట్ అక్కినేని నాగచైత‌న్య హీరోగా శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘థాంక్యూ’.

జగన్ మరో యూటర్న్.. శాసనమండలి రద్దు నిర్ణయం నుంచి వెనక్కి, అసెంబ్లీలో బుగ్గన తీర్మానం

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుని సంచలనం సృష్టించిన జగన్ సర్కారు…

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్‌టైమ్‌... డైరెక్ట‌ర్ కామెంటరీతో 'జీ 5'లో ఈ 26న విడుద‌లవుతున్న 'రిప‌బ్లిక్‌'

వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే ఓటీటీ వేదిక 'జీ 5'. వినోదం పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం ఇస్తూ ఉంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: కొట్టుకోబోయిన శ్రీరామ్- సన్నీ.. ఈవారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ 12వ వారానికి చేరుకుంది. ఇక మూడు వారాలు మాత్రమే మిగిలి వుండటంతో ఎవరు విన్నర్‌గా నిలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.