close
Choose your channels

ఎమ్మెల్యే రోజాపై దివ్యా వాణి బూతు పురాణం!

Sunday, February 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎమ్మెల్యే రోజాపై దివ్యా వాణి బూతు పురాణం!

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలకు ఎంత ఆత్రం ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. మీడియా ముందుకు వచ్చినా.. డిబెట్‌‌లలో, బహిరంగ సభల్లో మైకు దొరికితే చాలు ‘నేనింత’ అని చెప్పుకుంటూ ప్రత్యర్థులపై బూతు పురాణాలు సైతం సంధించడానికి సిద్ధమైపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధిష్టానం దృష్టిలో పడటానికి ఎక్కడలేని భగీరథ ప్రయత్నాలు చేస్తుంటారు ఇవన్నీ మన కళ్ల ముందు జరిగే విషయాలే కొత్తవేం కాదు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా పాపులర్ అయ్యేందుకు.. పబ్లిసిటీ సంపాదించుకునేందుకు అతిగా తాపత్రయ పడుతుంటారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. సేమ్ టూ సేమ్ పైన చెప్పిన విధంగానే పాపులర్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ మహిళా నేత యామిని సాధినేని ఇందుకు చక్కటి ఉదాహరణ. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడంలో పార్టీలో ఈమె తర్వాతే ఎవరైనా.! అలా మాటల తూటాలతో దూసుకెళ్తున్న ఆమెను అధిష్టానం గుర్తించి పదవి కూడా కట్టబెట్టింది. యామిని తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటి దివ్యావాణి. ఈమె ఏ క్షణాన పార్టీలో అడుగుపెట్టారేమో గానీ అందరి చర్చ దివ్యా గురించే.! పార్టీలో చేరి పట్టుమని కొన్ని నెలలు కూడా గడవలేదు.. అప్పుడే జనాల నోళ్లలోకి కరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో టీడీపీ తలపెట్టిన ‘ధర్మపోరాట దీక్ష’లో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలే చేశారు. ఈమె వ్యాఖ్యలను సీరియస్‌‌గా తీసుకున్న బీజేపీ నేతలు ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.

తాజాగా ఓ టీవీ చానెల్‌‌లో మాట్లాడిన దివ్యా వాణి.. వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేస్తూ బూతులు మాట్లాడారు! అసలు ఆమె లైవ్ డిబెట్‌‌లో ఉన్నానన్న విషయం మరిచిపోయి ప్రత్యర్థుల గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడేశారు. ఒకానొక సందర్భంలో ఎమ్మెల్యే రోజా గురించి దివ్యా వాణి మాట్లాడారు. అయితే ఆ మాటలు కాస్త నోరు జారి బూతులు దాకా వెళ్లడం గమనార్హం. ఇదివరకు రోజా మాట్లాడిన మాటలను ఆమె గుర్తు చేశారు.

రోజాను కొట్టేవాళ్లు లేరా..?

రోజా టీడీపీలో ఉన్నప్పుడు "రాజశేఖర్ రెడ్డిని పంచె ఊడదీసి కొట్టాలని కామెంట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక మహిళ అయ్యిండి ఆ మాట అన్నప్పుడు వైసీపీలో(కాదండీ అప్పుడు వైసీపీ లేదు.. కాంగ్రెస్ ఉన్నదని చెప్పడంతో దివ్యా తప్పు సరిదిద్దుకున్నారు) ఆమె చీర ఊడతీసి కొట్టడానికి మహిళలు లేరా? ఆమె ఆ మాట అన్నప్పుడు వైసీపీ అధినేత రాజశేఖర్ రెడ్డి అనుకుంటే అదేమైనా కొదువా" అని దివ్యా వాణి చీరె.. సారె అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు.

ఆ తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్‌‌లో చేరడం కొద్దిరోజులకే వైఎస్సార్ మరణించడంతో రోజాది ఐరెన్ లెగ్ అని అప్పుడు అందరూ అంటుండేవారని దివ్యావాణి చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ వ్యవహారం అనంతరం రోజా రాజకీయాలకు కొన్ని రోజులు దూరమయ్యారన్నారు. అయితే తాను మాత్రం ఎమ్మెల్యే రోజాలాగా కాదని తనకు తానుగా ఆమె జోస్యం చెప్పుకున్నారు. కాగా దివ్యవాణి వ్యాఖ్యలపై అటు నెటిజన్లు.. ఇటు వైఎస్ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మైకు దొరికితే చాలు.. లేదా డిబెట్లలో మీ ఇష్టానుసారం వ్యవహారించడం ఎంత వరకు సబబు..? అసలు మిమ్మల్ని ఎవరండీ డిబెట్లకు పిలిచేది..? అంటూ సదరు టీవీ చానెల్‌‌పై కూడా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే రోజా దృష్టికి లేదా అనేది తెలియరాలేదు.. ఒక వేళ ఆమె చెవిన దివ్యావాణి వ్యాఖ్యలు పడ్డాయంటే పరిస్థితి మామూలుగా ఉండదేమో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.