బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి డీకే అరుణ, పురందేశ్వరి..

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని జేపీ నడ్డా ప్రకటించారు. జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇరువురు మహిళా నేతలు స్థానం దక్కించుకోవడం విశేషం. 70 మంది సభ్యులతో జేపీ నడ్డా కొత్త టీమ్‌ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం దక్కింది. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలుగా డీకే అరుణ నియమితులయ్యారు. తెలంగాణ నుంచి ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ నియమితులయ్యారు.

ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమించారు. ఏపీకి చెందిన సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగానే కొనసాగనున్నారు. మొత్తంగా 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులుగా.. 13 మంది జాతీయ కార్యదర్శులుగా.. ముగ్గురు జాయింట్ జనరల్ సెక్రటరీలుగా జేపీ నడ్డా నియమించారు. వీటితో పాటు బీజేపీకి చెందని ఇతర విభాగాలకు సైతం అధ్యక్షులను, ఇన్‌చార్జులను నియమించారు.

రామ్ మాధవ్, మురళీధర్ రావులకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు దక్కలేదు. కొన్ని రోజులుగా వీరికి ప్రధాన కార్యదర్శ పదవులు ఇవ్వకపోవచ్చని ఊహాగానాలు జోరుగా వినిపించాయి. ఆ ఊహాగానాలన్నీ నేడు నిజమయ్యాయి. కాగా.. జీవీఎల్ నర్సింహారావుకు జాతీయ అధికార ప్రతినిధి హోదా దక్కలేదు. ప్రస్తుతం జీవీఎల్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

More News

బిగ్‌బాస్ 4 .. ఈ వారం ఎలిమినేట‌ర్ ఎవ‌రంటే..?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4లో మూడో ఎలిమినేష‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ఎలిమినేష‌న్స్ జ‌రిగాయి.

అభిమాని చెప్పులు తాకిన స్టార్ హీరో..!

హీరోలంటే సాధార‌ణ ప్రేక్ష‌కుల్లో ఓ క్రేజ్ ఉంటుంద‌నండంలో సందేహం లేదు. ఇక అగ్ర హీరోల గురించి, వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

నేష‌న‌ల్ మీడియాపై హ‌రీశ్ శంక‌ర్ సెటైర్ !

టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ నేష‌న‌ల్ మీడియాపై త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు.

త‌న విగ్ర‌హాన్ని తానే త‌యారు చేయించుకున్న బాలు...!

గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. ఐదు దశాబ్దాలు.. 12 భాష‌ల్లో 40వేల‌కు పైగా పాట‌లు...

డ్రగ్స్ చాట్ చేసినట్టు అంగీకరించిన రకుల్..!

డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు శుక్రవారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాజరైన విషయం తెలిసిందే.