అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: ఈటల

  • IndiaGlitz, [Tuesday,March 23 2021]

కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని అంతా రిలాక్స్ అవుతున్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకూ రెండు వందలకు పరిమితమైన కేసులు తాజాగా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రజలకు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యశాఖపై తాజాగా ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని మంత్రి ఈటల అన్నారు. కోవిడ్‌ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలన్నారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈటల ప్రజలను కోరారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, పక్క రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు. కరోనా కట్టడికి పక్కాగా చర్యలు తీసుకోవాలని, రోజుకు 50వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

More News

బాలీవుడ్ బ్యూటీతో వైష్ణ‌వ్ తేజ్‌..!

తొలి చిత్రం ‘ఉప్పెన‌’తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్న యంగ్ హీరో వైష్ణ‌వ్ తేజ్‌. వందకోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ‘ఉప్పెన’

‘తలైవి’ ట్రైలర్ : బొమ్మ బ్లాక్ బస్టరే..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత బయోపిక్‌‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘తలైవి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న

సూర్యాపేట కబడ్డీ పోటీల్లో అపశృతి.. 100 మందికి గాయాలు

సూర్యాపేటలో 47వ జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో  అపశ్రుతి చోటుచేసుకుంది.

భార్య పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆయనిచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్  మీడియాలో సంచలనంగా మారింది.

జాతీయ అవార్డులను గెలుచుకున్న ‘జెర్సీ’, ‘మహర్షి’

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర వివరాలను వెల్లడించింది.