Sharmila:ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా..? సీఎం జగన్‌కు షర్మిల సవాల్

  • IndiaGlitz, [Wednesday,May 01 2024]

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ సందేహాలు'కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనులకు సంబంధించిన అంశాలు వారిపై జరుగుతున్న దాడుల అంశాలను ఈ లేఖలో ప్రస్తావించారు.

లేఖలో షర్మిల లేవనెత్తిన సందేహాలు ఇవే..

1) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా?

2) సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారు?

3) 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు ?

4) ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం రాష్ట్రంలో ఎందుకు నిలిచిపోయింది?

5) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?

6) దళిత, గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు?

7) SC, STలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా?

8) దళిత డ్రైవర్ ను చంపి సూట్ కేసులో డోర్ డెలివరి చేసిన MLCని ఎందుకు సమర్థిస్తున్నారు?

9) స్టడీ సర్కిల్స్ కి నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?

ఈ సందేహాలకు సమాధానం చెప్పే దమ్ముందా..? అంటూ సవాల్ విసిరారు. కాగా ఇంతకుముందు రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని విమర్శిస్తూ ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి బరిలో దిగారు. దీంతో అక్కడ పోరు నువ్వా నేనా రీతిలో ఉంది. వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు ప్రత్యర్థులు తలపడటంతో రాష్ట్రమంతా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ కడప జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. మరి వైఎస్ కుటుంబం యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే జూన్ 4వరకు వేచి చూడాల్సిందే.

More News

Janasena:గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో జనసేనకు స్వల్ప ఊరట

స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన పార్టీకి హైకోర్టులో కాస్త ఊరట లభించింది.

Vaishnav Tej:పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ ప్రచారం

ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌

YCP Candidate Son:మా నాన్నను ఓడించండి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కుమారుడు పిలుపు..

ఏపీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో

Pension:ఒకటో తేదీ వచ్చింది.. పింఛన్ రాలేదు.. బ్యాంకులకు వెళ్లాలా అంటూ ఆగ్రహం..

తెల్లారింది... ఒకటో తేదీ వచ్చింది... ఎప్పట్లానే కరెన్సీ నోట్లతో గుమ్మం ముందు నవ్వుతూ నిలబడి తాతా.. పెన్షన్ తీసుకో...

TDP manifesto- Modi:టీడీపీ మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదా..? ప్రధాని మోదీ ఫొటో ఎందుకు లేదు..?

ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో