తెలుగు హీరోల బిరుదులు.. ఎలా మారాయో తెలుసా?

అభిమానులు ముద్దుగా పిలుచుకునేందుకు స్టార్ హీరోలకు బిరుదులు ఉంటాయి. ఆ బిరుదులు ఆకాశం నుంచి ఊడిపడ్డవి కాదు. హీరోల నటన, స్టైల్, మ్యానరిజమ్స్ కు తగ్గట్లుగా అభిమానులు పిలుచుకుంటారు. కొందరు హీరోలకు కెరీర్ ఆరంభంలో ఒక బిరుదు ఉంటే ఆ తర్వాత అవి మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. బిరుదులు మారిన స్టార్ హీరోలు తెలుగులో చాలా మందే ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి

ఓవర్ నైట్ లో చిరంజీవి మెగాస్టార్ అయిపోలేదు. కెరీర్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. చిరంజీవి ఎనర్జీ, పవర్ ఫుల్ యాక్టింగ్ చూసి ఆరంభంలో డైనమిక్ హీరో అని పిలిచేవారు. ఇంకాస్త జోరు పెరిగాక సుప్రీం హీరో అయ్యాడు. మరణమృదంగం నుంచి మెగాస్టార్ గా మారిపోయారు. మెగాస్టార్ అనే బిరుదు చిరంజీవికి పర్ఫెక్ట్ గా యాప్ట్ కావడంతో చిరస్థాయిగా అదే నిలిచిపోయింది.

యువరత్న టూ నటసింహం

నందమూరి బాలకృష్ణని అభిమానులు ముద్దుగా యువరత్న అని పిలుచుకుంటారు. ఈ బిరుదు బాలయ్యకు కెరీర్ ఆరంభం నుంచి వుంది. యాక్షన్, మాస్, ఫ్యామిలీ చిత్రాలతో పాటు జానపద, పౌరాణికాల్లో కూడా బాలయ్యకు మంచి పట్టు ఉంది. బాలయ్యకు సింహా అనే టైటిల్ బాగా కలసి వచ్చింది. బోయపాటి తెరకెక్కించిన సింహా చిత్రంతో బాలయ్య నటసింహంగా మారారు.

నాగార్జున

కింగ్ చిత్రం వరకు నాగార్జున బిరుదు యువ సామ్రాట్. శ్రీను వైట్ల తెరకెక్కించిన కింగ్ చిత్రం తర్వాత నాగ్ బిరుదు కింగ్ గా మారింది. అప్పుడప్పుడూ అభిమానులు నాగ్ ని మన్మథుడు అని కూడా పిలుస్తారు.

ది సూపర్ స్టార్

మహేష్ బాబుని పోకిరి చిత్రం వరకు ప్రిన్స్ అనే పిలిచేవారు. పోకిరి చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త సంచలనం సృష్టించింది. మహేష్ మాస్ స్టామినా అందరికి తెలిసేలా చేసింది. దీనితో పోకిరి తర్వాత విడుదలైన సైనికుడు చిత్రంలో మహేష్ పేరు ముందు సూపర్ స్టార్ అని పడుతుంది. మహేష్ బాబు తన తండ్రి వారసత్వంతో పాటు బిరుదుని కూడా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

యంగ్ టైగర్

ఆది, సింహాద్రి చిత్రాలతో యుక్త వయసులోనే ఎన్టీఆర్ బాక్సాఫీస్ పై సత్తా చాటాడు. దీనితో అభిమానులు ఎన్టీఆర్ ని ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకోవడం ప్రారంభించారు. శక్తి సినిమాలో ఏ1 స్టార్ అని పిలిచినా అది కలసి రాలేదు. దీనితో అభిమానులు యంగ్ టైగర్ అనే కొనసాగిస్తున్నారు.

యూత్ ఐకాన్

యువతలో ఎక్కువగా ప్రభావం చూపే హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ని ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ అని పిలుచుకునే వారు. కానీ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప నుంచి బన్నీ బిరుదు ఐకాన్ గా మారబోతోంది. ఇప్పటికే పుష్పలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని వేశారు.

More News

వరల్డ్ రికార్డ్ తో సూర్య సంచలనం.. సమంత రియాక్షన్

కలెక్షన్లు, క్రేజ్ పరంగా ఎన్నో చిత్రాలు విజయం సాధిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే గొప్ప సినిమా అనే గుర్తింపు లభిస్తుంది.

సెక్సీ ఏంజెల్ లా బిగ్ బాస్ దివి

ప్రతి ఏడాది బిగ్ బాస్ రూపంలో కొత్త సెలెబ్రిటీలు తయారవుతుంటారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో నటి దివి పాల్గొంది.

బిడ్డా గంగుల మాడి మసైపోతారు: ఈటల.. వెంట్రుక కూడా పీకలేవు: గంగుల

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హవాను తగ్గించేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు పార్టీని వీడకుండా కట్టడి చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

తన తాతయ్య మరణించారంటూ రామ్ భావోద్వేగ ట్వీట్

యంగ్ హీరో రామ్ పోతినేని ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య మంగళవారం కన్నుమూశారు.

రాజమౌళి ఆనవాయితీ.. చరణ్, ఎన్టీఆర్ విధ్వంసం ఊహకి కూడా అందదా!

ఐదేళ్లపాటు రాజమౌళి కష్టపడి తీర్చిదిద్దిన బాహుబలి రెండు భాగాలని చూసి ఆనందించాం.. విజువల వండర్ అని మురిసిపోయాం.