close
Choose your channels

క‌రోనా వైర‌స్ ఎలా పుట్టిందో తెలిస్తే షాక‌వుతారు..?

Thursday, January 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పుడు ప్ర‌పంచాన్ని ముఖ్యంగా చైనా దేశాన్ని భ‌య‌పెడుతున్న వైర‌స్ క‌రోనా. ఈ వైర‌స్ చైనాలోని ఉహాన్ న‌గ‌రంలో పుట్టింది. చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైర‌స్ భారి నుండి ఎలా బ‌య‌ట‌ప‌డాలో తెలియ‌క చైనీయులు బెంబేలు ప‌డుతున్నారు. అస‌లు ఈ వైర‌స్‌ను ఎలా అడ్డుకోవాలో తెలియ‌క చైనా శాస్త్ర‌వేత్త‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అస‌లు ఈ వైర‌స్ చైనాలోనే ఎందుకు పుట్టింద‌నే విష‌యంపై శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప్ర‌యోగాల్లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిశాయి. చైనాలో విష‌పూరిత‌మైన కోబ్రా, క్రైట్ జాతుల‌కు చెందిన పాములు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతుంటాయి.

ఈ విష‌పూరిత‌మైన పాములు క‌ర‌వ‌డం వ‌ల్ల‌నో.. లేక పాముల మాంసాన్ని కూడా ముందు వెనుకా ఆలోచించ‌కుండా తినేసే చైనీయుల కార‌ణంగానే ఈ వైర‌స్ పుట్టి ఉండొచ్చున‌ని అంటున్నారు. ఈ వైర‌స్ సోకిన 28 రోజుల్లో మ‌నిషి మ‌ర‌ణిస్తున్నాడు. అసలు ఈ వైర‌స్‌ను అడ్డుకోవ‌డానికి యాంటీ బ‌యాటిక్‌ను త‌యారు చేసే ప‌నిలో చైనా శాస్త్ర‌వేత్త‌లు త‌ల‌మున‌క‌లై ఉన్నారు. అస‌లు ఈ వైర‌స్ ఎలా సోకుతుందో తెలియ‌క ..నివార‌ణా చ‌ర్య‌ల్లో భాగంగా చైనా ప్ర‌భుత్వం ప్ర‌జా ర‌వాణా అపుతుంది. భార‌త‌దేశంకు వ‌చ్చే చైనా ప్ర‌యాణీకులను కూడా ఇక్క‌డి వైద్యులు ప‌రీక్షించి ఎవ‌రికీ క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు లేవ‌ని తేల్చారు. ఈ వైర‌స్ గురించి ఏం చేయాల‌నే దానిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.