సుశాంత్‌ని దారుణంగా కొట్టి చంపారు.. ఆధారాలతో వెల్లడించిన డాక్టర్ మీనాక్షి

  • IndiaGlitz, [Monday,August 03 2020]

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు సుశాంత్‌ది ఆత్మహత్య అని తేల్చింది. అయితే అది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ హత్యేనంటూ ఇటీవల మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామితో పలువురు సెలబ్రిటీలు సైతం ఆరోపించారు. తాజాగా వీరి వాదనను సమర్థిస్తూ మీనాక్షి మిశ్రా అనే ప్రముఖ డెర్మిటాలజీ డాక్టర్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో సుశాంత్‌ను దారుణంగా కొట్టి చంపేశాంటూ షాకింగ్ విషయాలను డాక్టర్ మిశ్రా వెల్లడించారు.

సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. ఆయన ముఖంతో పాటు ఇతర ప్రదేశాల్లో గాయాలను ఆమె వీడియోలో వివరించారు. ఉరి వేసుకుని మనిషి ఆత్మహత్య చేసుకుంటే నాలుకతోపాటు కనుగుడ్లు సైతం బయటకు వస్తాయని కానీ సుశాంత్ విషయంలో అవేమీ జరగలేదన్నారు. ఒక కన్ను మూసుకుపోయి ఉండగా.. మరో కన్ను తెరిచి ఉండటం.. ఆ కంటిపై ఉన్న గాయం చేతితో బలంగా కొడితేనే అవుతుందని వెల్లడించారు. సుశాంత్‌ని దారుణంగా కొట్టి చంపారన్నారు. సుశాంత్‌ని హింసించడానికి ముందు అతనికి మత్తు ఇచ్చి ఉండొచ్చని ఆమె భావిస్తున్నారు. మనల్ని పిచ్చోళ్లను చేస్తున్నారని.. కళ్లు మూసుకుని సుశాంత్‌ది మర్డర్ అని చెప్పగలనని మిశ్రా తెలిపారు.

More News

ఇళ‌య‌రాజాపై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్యలు

మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ప్ర‌సాద్ ల్యాబ్స్ నుండి త‌న‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని, త‌న వాయిద్య ప‌రిక‌రాల‌ను నాశ‌నం చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ కూడా...

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలు దాటేశాయి. వరుసగా ఐదు రోజులుగా దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటుతున్న విషయం తెలిసిందే.

సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ రాజకీయ నేతలు కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం..

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయించారు. నేడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.

బ్రేకింగ్: అమిత్ షాకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా..