ఏపీలో వీడిన సస్పెన్స్.. కరోనాను కంట్రోల్ చేసిన డాక్టర్‌కు మంత్రి పదవి!

  • IndiaGlitz, [Wednesday,July 15 2020]

ఏపీలో సస్పెన్స్ వీడింది. ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారి ప్లేస్‌ను ఏపీ సీఎం జగన్ ఎవరితో భర్తీ చేస్తారా? అనేది ఇన్ని రోజులుగా సస్పెన్స్‌లో ఉండి పోయింది. తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరపడింది. ఖాళీ అయిన మంత్రుల స్థానాలను అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో జగన్ భర్తీ చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఒకరికి కరోనా కారణంగా మంత్రి పదవి లభిస్తుండటం గమనార్హం. లాభ, నష్టాల బేరీజు వేసుకుంటే కరోనా ఎంత నష్టాన్ని కలిగించిందో అంతే ప్రయోజనం కూడా కలిగించిందనేది నిపుణులు చెబుతున్న మాట. ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చిందనే అంశాలను పక్కన బెడితే ఒకరికి మాత్రం మంత్రి పదవిని కట్టబెట్టబోతోంది.

అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు రాజ్యసభకు ఎన్నికవడంతో వారి మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఆ రెండు పదవులకు కొత్తవారి పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. రెండు మంత్రి పదవుల్లో మోపిదేవి స్థానాన్ని.. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుతో.. సుభాష్ చంద్రబోస్ స్థానాన్ని రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో భర్తీ చేయనున్నట్టు సమాచారం. అప్పలరాజు స్వతహాగా వైద్యుడు. ఇటీవల కరోనా విషయంలో అప్పలరాజు స్థానికంగా తీసుకున్న చర్యలు జగన్‌ను ఆకర్షించాయి. దీంతో ఆయనను కేబినెట్‌లోకి తీసుకుని వైద్య ఆరోగ్యశాఖను అప్పగించనున్నారని టాక్. ఆయన కలిసొచ్చిన మరో అంశం.. మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా.. అప్పలరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.

ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్.. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు.. వేణు గోపాలకృష్ణ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మంత్రి పదవికి లైన్ క్టియర్ అయింది. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో సుభాష్ చంద్రబోస్ వల్ల ఖాళీ అయిన స్థానానికి 9నెలలు మాత్రమే గడువు ఉంది. అందువల్ల ఆ స్థానానికి ఎన్నిక జరగదు. మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ స్థానాన్ని మర్రి రాజశేఖర్‌కు ఇస్తున్నారు. గవర్నర్ కోటాలో రెండు స్థానాలను కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా సుల్తానా అనే మహిళకు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషిన్ రాజుకు కేటాయించబోతున్నారని సమాచారం.

More News

ప్రభాస్ ద్విపాత్రాభినయం..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమా ‘రాధేశ్యామ్’ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

అల్లు అర్జున్‌ని ఆరాదిస్తోన్న బాలీవుడ్ తారలు

ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ‘అల వైకుంఠపురములో..’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్.

జగన్ కీలక నిర్ణయం.. కరోనా మృతుడి అంత్యక్రియలకు రూ.15000

ఏపీ సీఎం జగన్ కరోనా బాధితుల విషయమై మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో

హిందీలో రీమేక్ అవుతున్నతెలుగు సెన్సేష‌న‌ల్ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌’

ఈ ఏడాది ప్రారంభంలో విడుద‌లై, ప్రేక్ష‌కాద‌ర‌ణతో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘హిట్‌’.

క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం.. ఆరుగురి రక్త నమూనాలను సేకరించిన నిమ్స్

కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు దేశాలన్నీ వడివడిగా అడుగులు వేస్తున్నాయి.