close
Choose your channels

సోనూసూద్‌కి ఆమె న‌చ్చ‌లేదా?

Sunday, September 2, 2018 • తెలుగు Comments

సోనూసూద్‌కి ఆమె న‌చ్చ‌లేదా?

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్.. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌కి షాకిచ్చాడు. వివ‌రాల్లోకెళ్తే.. కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న చిత్రం మ‌ణిక‌ర్ణిక‌. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇందులో సోనూసూద్ మ‌రాఠా రాజు పాత్ర‌లో న‌టించారు.

దాదాపు ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. అయితే చివ‌రి నిమిషంలో ఆయ‌న సినిమా నుండి త‌ప్పుకున్నారు. అందుకు కార‌ణం కంగ‌నాతో ఆయ‌న‌కున్న విబేదాలే కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. విజ‌యేంద్ర ప్రసాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.