139 మంది అత్యాచారం కేసులో కీలకంగా మారిన ‘డాలర్ బాయ్’..

  • IndiaGlitz, [Friday,August 28 2020]

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నారు. ఈ కేసును తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్‌కి బదిలీ చేశారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ప్రముఖులు ఉండటంతో సవాల్‌గా తీసుకుని పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన డైరీని పంజాగుట్ట పోలీసులు.. సీసీఎస్ పోలీసులకు అందజేశారు. 139 మందిపై ఆరోపణల్లో నిందితులు ఎవరెవరున్నారు అనే దానిపై ముఖ్యంగా విచారణ జరుగుతోంది. యాంకర్ ప్రదీప్‌పై సదరు యువతి సంచలన ఆరోపణలు చేయడం.. దీనిపై ప్రదీప్‌ కూడా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ‘డాలర్ బాయ్’ అనే వ్యక్తి కీలకంగా మారినట్టు తెలుస్తోంది. బాధితురాలి పేరుతో డాలర్ బాయ్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కేసులో డాలర్ బాయ్ కీలకంగా మారాడు.

డాలర్ బాయ్ వ్యవహరంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డ్ చేశారు. తమ ప్రమేయం లేకపోయినా ఉద్దేశ పూర్వకంగా ఇరికించారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాలర్ బాయ్ చెర నుంచి పోలీసులు.. భాదితురాలిని తప్పించి.. ప్రభుత్వ హోంకి తరలించునున్నారు. కుమార్ అనే పేరుతో డాలర్ బాయ్ పలువురికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.

More News

బిగ్‌బాస్-4కి ముహూర్తం ఫిక్స్..

‘బిగ్‌బాస్’ సీజన్ 4 ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూసే ప్రేక్షకులకు షో యాజమాన్యం తేదీని ప్రకటించేసింది.

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. తాజాగా 77 వేలకు పైగా కేసులు

భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల్లో కొత్త రికార్డులు సాధిస్తోంది.

నన్ను కావాలని ఈ వివాదంలోకి లాగుతున్నారు: యాంకర్ ప్రదీప్

తనపై దాదాపు 150 మంది లైంగిక దాడి జరిపారంటూ ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది.

‘ఆచార్య’ కథపై స్పందించిన చిత్ర యూనిట్..

‘ఆచార్య’ కథ కాపీ అంటూ వస్తున్న ఆరోపణలపై చిత్ర యూనిట్ స్పందించింది. నేడు అధికారికంగా ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.

‘అల వైకుంఠపురములో’ మరో సంచలన రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉంది.