కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీస్‌లు రద్దు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన కేంద్రం తాజాగా.. ఎల్లుండి నుంచి అనగా.. బుధవారం రాత్రి నుంచి దేశీయ విమాన సర్వీసులన్నీ రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్క సరుకు రవాణా విమానాలు తప్ప మిగిలిన సర్వీసులు అన్నీ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మొత్తానికి చూస్తే.. దేశీయ రూట్లలో తిరిగే ప్రయాణికుల విమానాలు నిలిచిపోనున్నాయి.

కాగా.. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా కేంద్రం ఆంక్షలు విధించిన విషయం విదితమే. 22 నుంచి 29వతేదీ వరకు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నిషేధిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దేశంలోని ఏ ఒక్క విమానాశ్రయంలోనూ ల్యాండ్‌ అయ్యేందుకు వాటిని అనుమతించరు. కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రైళ్లు నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన విషయం విదితమే.

More News

టాలీవుడ్ నటుడికి కరోనా లక్షణాలు.. గోప్యంగా..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి టాలీవుడ్‌కూ సోకింది!. టాలీవుడ్‌కు చెందిన ఓ సహాయ నటుడికి కరోనా లక్షణాలున్నట్లు తెలుస్తోంది. 2 వారాల కిందట బ్యాంకాక్ నుంచి ఆయన హైదరాబాద్‌కు వచ్చాడని..

బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా?

నంద‌మూరి బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమా సెకండ్‌ షెడ్యూల్ వాయిదా ప‌డింది. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని

గేమ్ షో లో క‌న్నీళ్లు పెట్టుకున్న అనుష్క‌

నిశ్శ‌బ్దం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అనుష్క రీసెంట్‌గా ఓ గేమ్ షోలో పాల్గొన్నారు. ఇందులో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు స్వీటీ. అందులో భాగంగా సినిమాల్లో యాక్టింగ్‌, ప్ర‌భాస్‌తో స్నేహం వీటిలో

తెలంగాణ: పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. తాజాగా.. మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యిందని

రాత్రి 7 గంటలు నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మార్చి-31వరకు లాక్‌డౌన్ విధించిన కేసీఆర్ సర్కార్.. తాజాగా ప్రజలకు ఒకింత వార్నింగ్ ఇస్తూ సంచలన