close
Choose your channels

పుకార్లు నమ్మొద్దు.. నేను ఆరోగ్యంగానే ఉన్నా : అమిత్ షా

Saturday, May 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పుకార్లు నమ్మొద్దు.. నేను ఆరోగ్యంగానే ఉన్నా : అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. తనకోసం రంజాన్ మాసంలో ముస్లింలు అందరూ ప్రార్థన చేయాలని గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. దీంతో షాకు అసలేం జరిగింది..? ఆయనకు ఏమైంది..? అని కేంద్ర మంత్రులు, బీజేపీ కార్యకర్తలు, షా అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ విషయం అటు తిరిగి.. ఇటు తిరిగి షా చెవిన పడటంతో ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చుకున్నారు.

పుకార్లు నమ్మొద్దు..

‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు నమ్మకండి. ఈ పుకార్లు నేను పెద్దగా పట్టించుకోలేదు. అర్ధరాత్రి ఈ వ్యవహారం నా దృష్టికి వచ్చింది. ప్రజలందరూ వారి ఊహల్లో విహరిస్తూ ఉంటారని భావించాను. అందుకే నేను ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. గత రెండు రోజులుగా కోట్లాది మంది పార్టీ కార్యకర్తలు, శ్రేయాభిలాషులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు నేను స్పందించి క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాను. ఏ వ్యాధితోనూ నేను బాధపడట్లేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారితో దేశం పోరాడుతోంది. హోంమంత్రిగా నేను బాధ్యతల నిర్వహణలో చాలా బిజీగా ఉన్నాను. అందుకే ఇలా నాపై వస్తున్న పుకార్లపై నేను దృష్టి సారించలేదు’ అని అమిత్ షా క్లారిటీ ఇచ్చుకున్నారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు, నేతల్లో ఆందోళన తగ్గినట్లు అయ్యింది.

షా ఆరోగ్యంపై పుకార్లు ఏమొచ్చాయ్!?

‘నా ప్రియమైన ప్రజలారా.. నేను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశ హితం కోసమే. నేను ఎవర్నీ కులం, మత పరంగా ద్వేషించను.. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. అయితే గత కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగ్గా లేనందున దేశ ప్రజలకు సరిగ్గా సేవ చేయలేకపోతున్నాను. నేను బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నా. నేను తొందరగా కోలుకోవాలని రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరలంతా ప్రార్థనలు చేయండి. తొందర్లోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. దయచేసి నేను చెప్పినట్లు చేయండి’ అని అమిత్‌షా పోస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.

నలుగురు అరెస్ట్

అయితే ఈ ట్వీట్స్ అమిత్ షా చేయలేదు. ఎవరూ చేశారా అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. హోంమంత్రి పేరుతో ఫేక్ ట్వీట్స్ చేసిన నలుగురిని గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఫిరోజ్ ఖాన్, సర్ఫరాజ్, సజ్జాద్ అలీ, సిరాజ్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఈ నలుగురు అమిత్ షా పేరుతో ఉన్న అఫిషీయల్ ట్విట్టర్‌ పోస్ట్ వచ్చేలా ఎడిట్ చేసి.. ఆయన ఆరోగ్యం బాగులేదంటూ దుష్ప్రచారం చేశారు. అంతేకాదు.. మరికొందరు ఆయన ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఫేక్ ప్రచారం చేశారు. చివరికి కటకటాలపాలయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.