కరోనా నేపథ్యం : వైరల్ అవుతున్న ఈ తప్పుడు విషయాలు నమ్మకండి!

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెరికా, చైనా, ఇటలీ లాంటి పెద్ద దేశాల్లో గంట గంటకూ పెద్ద ఎత్తునే మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో ఇండియన్స్ భయపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు.. వాటికి ఆనుకుని ఉన్న స్టేట్స్‌లో పరిస్థితి అల్లకల్లోల్లంగా ఉంది. వాస్తవానికి లాక్ డౌన్ నేపథ్యంలో జనాలు అందరూ ఇళ్లకే పరిమితం కాగా.. కరోనా లక్షణాలున్నవారు హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు.

ఈ క్రమంలో దీన్నే అదనుగా చేసుకున్న కొందరు పనిగట్టుకుని పుకార్లు పుట్టిస్తున్నారు. ఎవరైతే తనకు ప్రత్యకర్థులు ఉంటారో వారి పేరిట వీడియోలు, ఫోన్‌లు, ఆడియో క్లిప్పింగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలే వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఆ తప్పుడు విషయాలు.. ప్రకటనలతో అసలు ఏది నిజమో..? ఏది అబద్ధమో తెలియక తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో వీటిపై దాదాపు జనాలకు అవగాహన ఇవన్నీ నిజమేనని గుడ్డిగా నమ్మేస్తున్నారు. అయితే జనాల్లో చైతన్యం నింపేందుకు www.indiaglitz.com చిరు ప్రయత్నం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు విషయాలు..:-

1. అపోలో డాక్టర్-రిపోర్టర్ సంభాషణ
2. మాజీ జేడీ లక్ష్మీనారాయణ వాయిస్
3. ఇటలీలో ట్రక్కులో కుప్పల శవాలు
4. జియో వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి
5. డాక్టర్ దంపతుల మరణం
6. రష్యా 500 సింహాలు రోడ్లపై వడలడడం
7. కరోనా వైరస్‌కు డాక్టర్ గుప్త మందు
8. రోడ్ల పైన పడిఉన్న దేహాలు
9. డాక్టర్ నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన
10. COVID-19 పేరుతో మార్కెట్‌లోకి మందు
11. ఆవుకు పుట్టిన మనిషి
12. మోదీ గారి 1000 GB ఫ్రీ..
13. బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు. ఈ ఊర్లో, ఆ ఊర్లో కరోనా అంటూ వదంతులు.... ఇలాంటివి మన ఫోనులో మరెన్నో వస్తున్నాయి.

ఇలాంటి తప్పుడు వార్తల మధ్య వాస్తవాలు నలిగిపోతున్నాయి.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను తప్పుద్రోవ పట్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఉద్రేకపరచడం, చాలా ప్రమాదం.. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే మనం అనుసరిద్దాం. మిత్రులారా మేల్కొనండి.. వదంతులు తప్పుడు సమాచారాలు నమ్మకండి.. ప్రచారం చేయకండి.. వివేకంతో, బాధ్యతగా మెలుగుదామని www.indiaglitz.com కోరుతోంది.

More News

నాకు కరోనా సోకలేదు.. ఆందోళన వద్దు : కమల్

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెరికా, చైనా, ఇటలీ లాంటి పెద్ద దేశాల్లో గంట గంటకూ పెద్ద ఎత్తునే మరణాలు సంభవిస్తున్నాయి.

సినీ కార్మికులకు సురేష్ ప్రొడక్షన్స్ కోటి విరాళం..

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

స్టార్ హీరో అక్షయ్ 25 కోట్ల భారీ విరాళం

దేశవ్యాప్తంగా కరోనా ముప్పు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ‘పీఎం కేర్స్ ఫండ్’ ఏర్పాటు చేశారు. కరోనాపై పోరుకు, సహాయక చర్యలకు ఉపయోగపడేలా విరాళాలు ఇవ్వదలిచిన వారికి

కోటి రూపాయిలిచ్చి ‘కింగ్’ అనిపించుకున్న నాగ్..

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

చ‌ర‌ణ్ త‌దుప‌రి ద‌ర్శ‌కుడు అత‌నేనా?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ‘రౌద్రం ర‌ణం రుధిరం’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్