ఉదయ్ కిరణ్ తో పోల్చవద్దు.. అతడికి జరిగింది బాధాకరం: వరుణ్ సందేశ్

  • IndiaGlitz, [Friday,July 23 2021]

హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం లాంటి చిత్రాలతో వరుణ్ సందేశ్ అప్పట్లో టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ వరుస పరాజయాలు ఎదురుకాడంతో వెనుకబడ్డాడు. ముఖ్యంగా కొత్తబంగారు లోకం చిత్రంలో వరుణ్ సందేశ్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

ఇదీ చదవండి: వారేవా.. సూపర్ హీరోగా రానా దగ్గుబాటి

ఇక బిగ్ బాస్ 3లో వరుణ్ సందేశ్ కంటెస్టెంట్ గా పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. బిగ్ బాస్ 3 వరుణ్ సందేశ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు వరుణ్ సందేశ్ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటిస్తున్న చిత్రం 'ఇందువదన'. రొమాంటిక్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎంఎస్ఆర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫర్నేజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా వరుణ్ సందేశ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ డౌన్ కావడానికి కారణాలు వివరించాడు. తాను ఎంచుకున్న కథలే ఫెయిల్యూర్ కి కారణం అయ్యాయి అని తెలిపాడు. అది పూర్తిగా నా తప్పే. ఎవరినీ నేను బ్లేమ్ చేయను అని వరుణ్ తెలిపాడు.

ఇక ఉదయ్ కిరణ్, తరుణ్ తరహాలోనే తన కెరీర్ కూడా డౌన్ అయ్యింది అని ప్రశ్నించగా వారితో తన కెరీర్ పోల్చవద్దు అని వరుణ్ సందేశ్ కోరాడు. ఉదయ్ కిరణ్ నాకు బాగా తెలుసు. అతడి జీవితంలో ఏదైతే జరిగిందో అది బాధాకరం.ఇక తరుణ్ కూడా తనకు తెలుసు అని వరుణ్ అన్నాడు. అయితే తన కెరీర్ కు వారితో పోలిక లేదని వరుణ్ తెలిపాడు. బిగ్ బాస్ తర్వాత తాను సాఫ్ట్ వేర్ వైపు, బిజినెస్ వైపు వెళ్లిపోదామా అనే ఆలోచన కూడా వచ్చిందని.. కానీ సినిమాల్లోనే గట్టిగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు వరుణ్ పేర్కొన్నాడు.

More News

వారేవా.. సూపర్ హీరోగా రానా దగ్గుబాటి

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

వరుణ్ తేజ్ లుక్ కి 'పుష్ప'రాజ్ ఫిదా.. బన్నీ స్పెషల్ సర్ ప్రైజ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

బజ్: RRR కోసం ప్రభాస్, రవితేజ, నితిన్, నాని, సునీల్ ?

ఆర్ఆర్ఆర్ చిత్రం అనుకున్న టైం కంటే బాగా ఆలస్యం అయింది.

సూర్య 40 ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు పూనకాలే

జూలై 23న హీరో సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సూర్య 40 వ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలయింది. పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఏపీలో థియేటర్లు నడపలేను: సురేష్ బాబు

ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో సమస్యలు ఎక్కువవుతున్నాయి. కరోనా ప్రభావం బిజినెస్ ని పూర్తిగా దెబ్బతీస్తోంది.