డోర రహస్యం

  • IndiaGlitz, [Sunday,February 19 2017]

దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది నయనతార. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలో తెలుగు టీజర్‌ను, ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ విభిన్న కథ, కథనాలతో తెరకెక్కుతున్న హారర్ చిత్రమిది.
ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. డోర అనే పేరు వెనకున్న రహస్యమేమిటనేది తెరపై ఉత్కంఠను పంచుతుంది. ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి సన్నివేశం థ్రిల్‌ను కలిగిస్తుంది. నయనతార నటన, పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటాయి. గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రమిది. నవ్యతతో కూడిన కథాబలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఇటీవలే విడుదలైన తమిళ టీజర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ఈ నెలలోనే తెలుగు టీజర్‌ను, ఆడియోను విడుదల చేస్తాం. మా సంస్థ నుండి వచ్చిన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

More News

మార్చిలో అఖిల్ చిత్రం....

అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం అఖిల్ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో

20 కోట్ల ఫైట్....

సూపర్ స్టార్ రజనీకాంత్,అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ ప్రధాన తారాగణంగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా '2.0'.

నిఖిల్ 'కేశవ' రిలీజ్ డేట్...

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది. రీసంట్గా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ తాజా చిత్రం 'కేశవ'ను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.

బన్నిని అడ్డుకున్న స్థానికులు..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ఫై దిల్రాజు నిర్మిస్తున్న చిత్రం డి.జె. దువ్వాడ జగన్నాథమ్. ప్రస్తుతం ఈ సినిమా కర్ణాటకలో చిత్రీకరణను జరుపుకుంటుంది.

పోలీసుల కోసం స్పెషల్ షోస్..

పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ తో సూర్య,హరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం సింగం 3.