మా ప్రేమ కూడా ఉద్యమమే
Send us your feedback to audioarticles@vaarta.com
`దొరసాని` ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం ద్వారా ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. ఇందులో ఒక పక్క రాజు, దొరసారి మధ్య ప్రేమ కథతో పాటు.. మరో పక్క నక్సలిజం కాన్సెప్ట్‌తో ఈ కథను రూపొందించారు. 1980ల్లో ప్రేమకథలు ఎలా ఉండేవి? అదే సమయంలో ఉద్యమ ప్రభావం ఎలా ఉండేది? అంశాలను సినిమాలో చూపించబోతున్నట్లు తెలిసింది.
పేదవాడుగా ఆనంద్ దేవరకొండ, దొరసానిగా శివాత్మిక చక్కగా నటించారని ట్రైలర్ ప్రెజంటేషన్లో తెలుస్తోంది. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో విడుదలవుతుంది. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతాన్ని అందించారు. జూలై 12న సినిమా విడుదల అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.