పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా... డిసెంబర్ 10న 'దొరకునా ఇటువంటి సేవ'

  • IndiaGlitz, [Thursday,November 25 2021]

సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా 'దొరకునా ఇటువంటి సేవ'. 'ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్'... అనేది ఉపశీర్షిక. వెంకీ ద‌డ్‌బ‌జ‌న్‌, టి.ఎన్.ఆర్, రవి వర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రిత్విక్ రెడ్డి ప్రధాన తారాగణం. డిసెంబర్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు రామచంద్ర రాగిపిండి మాట్లాడుతూ ఒక మంచి విషయం చెబుతూ మంచి సినిమా తీయడం చాలా సులభం. సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం. ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగే నేరాలు విపరీతంగా పెరిగాయి. ప్రతి పదిమందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. క్షణికానందం కోసం ఎవరైనా అడ్డొస్తే... చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో కథతో ప్రేక్షకులకు నచ్చే విధంగా... 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్', 'గుంటూరు టాకీస్', 'ఆర్ఎక్స్ 100' సినిమాల తరహాలో వాటికి భిన్నమైన కంటెంట్‌తో సినిమా తెరకెక్కించాను అని అన్నారు.

నిర్మాత దేవ్ మహేశ్వరం మాట్లాడుతూ ఎవరూ ధైర్యం చేయలేని కొత్త కథాంశాలను బోల్డ్‌గా, బ్యాలెన్స్డ్‌గా తెరకెక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నప్పుడు పెద్ద సినిమాల మధ్య వచ్చినా విజయం అందిస్తారని డిసెంబర్ 10న 'దొరకునా ఇటువంటి సేవ' సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని అన్నారు.

సందీప్ పగడాల, నవ్య రాజ్ హీరో హీరోయిన్లుగా... వెంకీ ద‌డ్‌బ‌జ‌న్‌, టి.ఎన్.ఆర్, రవి వర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రిత్విక్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డీఐ అండ్ అట్మాస్ మిక్సింగ్: ఏయన్నార్ సౌండ్ అండ్ విజన్, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, కలరిస్ట్: శివ కుమార్, సౌండ్ ఇంజినీర్: ఇనియన్ సిఎస్, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, కెమెరా: రామ్ పండుగల, మ్యూజిక్: యస్.యస్. ఫాక్టరీ, నిర్మాత: దేవ్ మహేశ్వరం, రచన-దర్శకత్వం: రామచంద్ర రాగిపిండి.

More News

ఆన్‌లైన్‌లో టికెట్లు మంచిదే.. కానీ ధరల విషయం ఆలోచించండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై చిరు స్పందన

సినిమా టికెట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ఏపీ వరదలు: గీతా ఆర్ట్స్ ఒక్కటేనా.. మిగిలిన సినీ జనాలకు పట్టదా..?

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తినష్టం జరిగింది.

#SSMB28 : మహేశ్- త్రివిక్రమ్ మూవీ నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. సమంతకు ఛాన్స్..?

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడు అగ్ర కథానాయికగా దూసుకెళ్తోంది. ఈ సినిమాలో చూసినా పూజానే కనిపిస్తోంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది.

కరోనా బారినపడ్డ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.. పరిస్థితి విషమం, సాయం కోసం కొడుకు విజ్ఞప్తి

దేశంలో కరోనా కారణంగా ఎందరో సినీ నటీనటుడు, సాంకేతిక నిపుణులు ప్రాణాలు కోల్పోగా.. ఇంకా పలువురు వైరస్ బారినపడుతున్నారు.