‘శేఖర్’ సినిమా ప్రదర్శన నిలిపివేత.. కుట్రలు చేసి అడ్డుకున్నారు, ఎంతో కష్టపడ్డాం: రాజశేఖర్ సంచలన పోస్ట్

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో నడుస్తోంది. జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించడం విశేషం. అయితే, రాజశేఖర్ నేడు సంచలన ప్రకటన చేశారు. తన శేఖర్ చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి, చిత్ర ప్రదర్శనను నిలిపివేయించారని ఆరోపించారు. సినిమాయే తమకు లోకమని, ముఖ్యంగా ఈ శేఖర్ చిత్రంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా.. ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదివారం చిత్ర యూనిట్‌ను ఆదేశించింది. ఈ సినిమా కోసం జీవితా రాజశేఖర్ తన వద్ద రూ. 65 లక్షలు అప్పుగా తీసుకున్నారని పరంధామ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. సినిమా విడుదల సందర్భంగా బాకీ తీరుస్తామని మాట ఇచ్చారని... కానీ తనకు రావాల్సిన మొత్తాన్ని జీవితా రాజశేఖర్ చెల్లించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ... జీవితా రాజశేఖర్ 48 గంటల్లోగా రూ. 65 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ కింద కోర్టులో సమర్ఫించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే కోర్టు ఆదేశించినా డబ్బు చెల్లించకపోవడంతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై హీరో రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి, సినిమా ప్రదర్శన నిలిపివేయించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఎంతో కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా సినిమాను అడ్డుకుంటున్నారు. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.... ఎవరెన్ని చేసినా ఈ చిత్రం తిరిగి ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ‘శేఖర్’కు ఉందని నేను భావిస్తున్నాను అంటూ రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

More News

2024లో పవన్  సీఎం కావాల్సిందే.. మెగా అభిమానులంతా జనసేన వెంటే : చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు

మెగా అభిమానులు చిరంజీవి, పవన్ కల్యాణ్ , రామ్‌చరణ్, అల్లు అర్జున్ వర్గాలుగా చిలీపోయారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ విజేత బిందు మాధవి.. కప్ కొట్టిన తొలి మహిళగా చరిత్ర

సోషల్ మీడియాలో వచ్చిన లీకులే నిజమయ్యాయి. బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్‌ విజేతగా సినీనటి బిందు మాధవి నిలిచారు.

స్టార్ మా లో "సూపర్ సింగర్ జూనియర్"

ఎక్కడెక్కడో వున్న కొత్త కొత్త ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేయడంలో ముందుంటుంది "స్టార్ మా". ఎన్నో అద్భుతమైన స్వరాలను సినిమా రంగానికి పరిచయం చేసింది స్టార్ మా.

శేఖర్ మూవీ నాది.. సినిమా జోలికొస్తే పరువు నష్టం దావా వేస్తా: నిర్మాత సుధాకర్ రెడ్డి వార్నింగ్

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన శేఖర్ సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆ చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విజేతగా బిందు మాధవి... సోషల్ మీడియాలో లీకులు, గెలిస్తే చరిత్రే

బిగ్‌బాస్ .. బుల్లితెరపై దీనికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హిందీలో అడుగుపెట్టిన ఈ షో.. క్రమంగా భారత్‌లోని ప్రాంతీయ భాషలకు సైతం విస్తరించింది.