మత్తులో ఫ్రెండ్‌కు ఫోన్.. రాకపోవడంతో ఉరేసుకుని లైవ్‌లో..!

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

ఓ యువకుడు మద్యం మత్తులో చేసిన పనికి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలే రాత్రిపూట పీకల్లోతు మద్యంతలో మునిగి తేలుతున్న ఆ యువకుడు.. మిత్రుడికి ఫోన్ చేసి ‘మచ్చా మందు తాగుదాం రా.. రెండ్రోజులుగా పిలుస్తున్నా నువ్ రావట్లేదు.. నాకు చాలా బాధగా ఉంది.. నువ్ వస్తావా.. రావా.. నువ్ రాకుంటే ఇదిగో చూడు ఇలా ఉరేసుకుని చనిపోతా’ అంటూ వీడియో కాల్ చేసి మిత్రుడ్ని ఆ యువకుడు బెదిరించాడు. అరె తెల్లారి వస్తాను.. నువ్వేం చేసుకోకు.. తినేసి పడుకో అని పదే పదే చెప్పినప్పటికి వినిపించుకోలేదు.. అవతలి వైపున్న మిత్రుడు అడుక్కునేసరికి ఈ యువకుడు మరింత రెచ్చిపోయి వీడియో కాల్‌లో ఉండగానే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.. టాటా చెప్పి.. ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు నటించాడు.

మంచం మీదున్నప్పుడు ఈ వ్యవహారం అంతా జరిగింది. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు అటు ఇటు పెనుగులాడేసరికి సెకండ్లలో ప్రాణాలు కలిసిపోయాయి. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఈ ఘటన మొత్తం ఫోన్‌‌లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా చనిపోయిన వ్యక్తి మెకానిక్ శివకుమార్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.

సోషల్‌ మీడియాలో అవసరాలకు, సరదా కోసం చూసి ఊరుకోండి అంతే కానీ.. ఇలా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ కన్న తల్లిదండ్రుల కడుపు కొట్టకండి అని విశ్లేషకులు చెబుతున్నారు. మీ కన్న తల్లిదండ్రులు మీ మీదే ఆశలతో బతుకుంతుంటారు.. అలాంటి వారికి కడుపుకోత మిగిల్చకుండా మనం ఏం చేస్తున్నాం..? అనే ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తే మంచిది. 

More News

'నువ్వు తోపు రా' ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

బేబి జాహ్న‌వి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం 'నువ్వు తోపురా'. యునైటెడ్ ఫిలింస్‌, ఎస్‌.జె.కె. ప్రొడ‌క్ష‌న్స్(యు.ఎస్‌.ఎ) ప‌తాకాల‌పై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'దిక్సూచి'

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌

సింగిల్ సాంగ్‌తో వావ్ అనిపించిన అమెరికా కోయిలలు

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. టాలెంట్ ఉన్నోళ్లు దునియానే ఏలొచ్చు.. అనేది అక్షర సత్యం.

నిజాయ‌తీతో జెన్యూన్‌గా క‌థ చెప్పిన‌ప్పుడు మ్యాజిక్ క్రియేట్ అవుతుంద‌ద‌ని 'జెర్సీ' తో ప్రూవ్ అయ్యింది - నాని

నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కుడు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుద‌లైంది.

'RRR' లో వారిద్ద‌రూ న‌టించ‌లేదా?

రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `RRR`. ఇందులో రాంచ‌రణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది.