విలన్ గా కొత్తావతారం - డి.ఎస్.రావు

  • IndiaGlitz, [Friday,November 09 2018]

నితిన్ తో 'ద్రోణ', నానితో 'పిల్ల జమీందార్', నిఖిల్ తో 'కళావర్ కింగ్', మంచు మనోజ్ తో 'మిస్టర్ నూకయ్య' వంటి పలు భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు నటుడిగానూ బిజీ అవుతున్నారు.

ప్రముఖ దర్శకుడు తేజ తొలిసారి డి.ఎస్.రావులోని నటుడిని గుర్తించి, 'హోరాహోరీ'లో విలన్ గా అవకాశమిచ్చారు. తదుపరి నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన కళ్యాణవైభోగంలోనూ ముఖ్య పాత్ర పోషించి మెప్పించిన డి ఎస్.రావు నటుడిగా ఇప్పటికి 15 సినిమాలు చేశారు. ప్రస్తుతం రంగు, నయనం, విశ్వామిత్ర, ప్రేమకథాచిత్రం-2, కల్కి, యుద్ధం చెయ్ వంటి చిత్రాలో విభిన్నమైన పాత్రలు చేస్తూ.. నటుడిగా ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టూ ఎక్కుతున్నారు.

నవంబర్ 10, తన జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాతగా ఇప్పటికి 20 సినిమాలు తీశాను. ప్రముఖ దర్శకుడు తేజ ప్రోత్సాహంతో నటుడిగా మారాను. తెలుగుతోపాటు కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తున్నాను. నటుడిగా రాణిస్తూనే.. మంచి ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు ప్రొడ్యూస్ చేస్తాను. ముఖ్యంగా విలన్ గా మంచి గుర్తింపు సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు!

More News

'RX 100' ఫేంకార్తికేయ హీరోగా 'హిప్పీ' సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం

RX 100 చిత్రంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ , దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను, దర్శకుడు టీఎన్ కృష్ణ కాంబినేషన్  లో

ఈనెల 11న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్

గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా

ముర‌గ‌దాస్ ఇంటికి పోలీసులు

త‌మిళ హీరో విజ‌య్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ స‌ర్కార్‌. అభిమానుల ఆద‌ర‌ణ‌ను అందుకుంటుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' ఫస్ట్ లుక్ విడుదల..!!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'కవచం' సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు..

సుస్మితా సేన్ పెళ్లి

మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ పెళ్లి చేసుకోనుంది. లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ కార‌ణంగానే ఆమె పెళ్లి చేసుకుంటుంది.