close
Choose your channels

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో దుల్క‌ర్ త్రిభాషా చిత్రం...

Tuesday, July 28, 2020 • తెలుగు Comments

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో దుల్క‌ర్ త్రిభాషా చిత్రం...

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ త‌న‌యుడు మ‌మ్ముటి త‌న‌యుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన దుల్క‌ర్ సల్మాన్ సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కేవ‌లం మ‌ల‌యాళ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా విల‌క్ష‌ణమైన పాత్ర‌లు చేయ‌డానికి కూడా దుల్క‌ర్ ఆస‌క్తి చూపుతుండ‌టంతో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు మాత్రం కీర్తిసురేశ్‌తో వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్నా సినిమా నిర్మించిన మ‌హాన‌టితోనే ద‌గ్గ‌ర‌య్యారు. ఈ చిత్రంలో జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ‘మ‌హాన‌టి’ సినిమా నిర్మాత‌ల‌తో దుల్క‌ర్ మ‌రో సినిమా చేయ‌నున్నారు. అది కూడా త్రిభాషా చిత్రం. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా తెర‌కెక్క‌నుంది. లెఫ్టెనెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమకథనే సినిమాగా మలుస్తున్నారు. 1964 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. మంగ‌ళ‌వారం దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ అనే క్యాప్ష‌న్ ఇవ్వ‌డంతో సినిమాలోని ఇన్‌టెన్స్‌ను అర్థం చేసుకోవ‌చ్చు. ‘అందాల రాక్ష‌సి, ప‌డిప‌డి లేచె మ‌న‌సు’ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిని తెరకెక్కించనున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz