బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి

  • IndiaGlitz, [Tuesday,April 02 2024]

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుకోవడానికి పొలం బాట పట్టి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్‌కు 48 గంటల సమయం ఇస్తున్నానని.. పూర్తి వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు ఎండిపోక ముందే ఆ విషయం తమకు చెప్పొచ్చు కదా ఎండిపోయిన తరువాత మంటల దగ్గర కేసీఆర్ చలి కాచుకుందాం అనుకుంటున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం రైతుల ముఖం చూడని కేసీఆర్.. 10 సంవత్సరాల తర్వాత అయినా పొలం బాట పట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. అధికారం కోల్పోయినందుకు, కూతురు జైలుకు పోయినందుకు కేసీఆర్‌ను చూస్తే జాలి కలుగుతోందన్నారు. కేసీఆర్ పాపాలకే ఈ కరువు అని.. కేసీఆర్ పాపాలు కాంగ్రెస్ ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే 65 లక్షల రైతుల ఖాతాలో రైతు బంధు వేసిందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని బొక్కలే ఉన్నాయని ఇక నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమని బీఆర్ఎస్ నేతలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. రైతులకు ఓ రూ.100 కోట్లు సహాయం చేయవచ్చు కదా అని సూచించారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని.. ఎన్నికల కోడ్ తర్వాత మిగతా హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 6 తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుందని.. ఆ సభలోనే ఏఐసీసీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభకు హాజరవుతారని చెప్పారు. అంతకుముందు సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను రేవంత్ పరిశీలించారు.

More News

ఏపీలో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల

ఏపీలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు

ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారుల్లో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'పుష్ప' గాడి మాస్ జాతర మొదలు..

'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.

ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌లో జూనియర్ ఎన్టీఆర్ సందడి.. ఎందుకంటే..?

మ్యాన్ ఆఫ్‌ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(JR NTR) తాజాగా మెర్సిడేజ్ బెంజ్ కొత్త కారును కొన్నాడు. దీంతో ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌కి వచ్చాడు.

YS Sharmila: అవినాశ్ రెడ్డిపై షర్మిల పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది.