దానయ్యకు తప్పడం లేదు...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రాంచరణ్, బోయపాటి కాంబినేషన్లో డి.వి.వి.దానయ్య నిర్మించిన చిత్రం 'వినయవిధేయరామ'. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా దాదాపు 92 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అయితే తొలివారం ముగిసే సరికి దాదాపు 57 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది.
ఈ సినిమాను విడుదల చేసిన యు.వి.క్రియేషన్స్‌కు భారీ నష్టాలు మిగిలాయి. నిర్మాత దానయ్య తన తదుపరి చిత్రాన్ని నష్టాలను కవర్ చేసేలా తక్కువ మొత్తానికి ఇచ్చేలా దానయ్య డిస్ట్రిబ్యూటర్స్‌కు మాట ఇవ్వలేడట.
అందుకు కారణం రాజమౌళి ఒప్పుకోలేదట. అందువల్ల దానయ్య యు.వి.కి 15 కోట్లను చెల్లించాల్సి వస్తుంది. చేతిలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ వంటి క్రేజీ మల్టీస్టారర్ ఉన్న దానయ్యకు డబ్బు వెనక్కి ఇవ్వడం తప్పడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.